NTV Telugu Site icon

Actress Kasturi : వివాదస్పద వ్యాఖ్యలపై ‘నటి కస్తూరి’ వివరణ

Kasturi 2

Kasturi 2

చెన్నైలో ఆదివారం జరిగిన ఓ సభలో బీజేపీ మహిళా నాయకురాలు నటి కస్తూరి తెలుగు వారిపై ‘ రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ మహిళా నాయకురాలు, తమిళ సినీ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే… మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు. ప్రస్తుత తమిళనాడు మంత్రివర్గంలో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు. ‘ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజుపడొద్దు.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దు.. అని బ్రాహ్మణులు చెబుతున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది’ అని అన్నారు.

Also Read : Vijay Sethupathi : ఫాన్సీ రేటు ‘విడుదల – 2’ తెలుగు థియేట్రికల్ రైట్స్..

కస్తూరి వ్యాఖ్యలపై చెన్నైలోని తెలుగు సంఘాలు మండిపడ్డాయి. తక్షణమే తెలుగు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాయి. ఈ వివాదం కాస్త ముదురుతుండడంతో తన వ్యాఖ్యలపై  కస్తూరి వివరణ ఇస్తూ ” తెలుగుప్రజల గురించి నేను తప్పుగా మాట్లాడినట్లు ప్రచారం చేస్తున్నారు. డీఎంకే వాళ్లు కావాలని నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాపై నెగిటివిటీ తీసుకొచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు నాపై ఎంతో అభిమానం చూపుతున్నారు. నన్ను వారు ఎంతగానో ఆదరించారు. ఆ ప్రేమను దూరం చేసేందుకు డీఎంకే వాళ్లు నాపై కుట్ర చేస్తున్నారు” అని అన్నారు.

Show comments