ప్రిజం పబ్ లో నానా హంగామా చేసిన నటి కల్పిక పైన పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29న, రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన కల్పిక అక్కడి సిబ్బంది పై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేయడంతో, అక్కడికి పోలీసులు వచ్చారు. పోలీసుల పైన కూడా కల్పిక దురుసుగా వ్యవహరించారు. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు గ్లాసులుతో పాటు ఫర్నిచర్‌ని కూడా కల్పిక ధ్వంసం చేసింది.
Also Read : Gopichand 33: గోపీచంద్ – సంకల్ప్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ విడుదల..
ఈ నేపథ్యంలో, ప్రిజం పబ్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసును విచారించిన అనంతరం కోర్టు అనుమతి తో పోలీసులు నటి కల్పికపై కేసు నమోదు చేశారు. దీంతో బి ఎన్ఎస్ సెక్షన్లు 324(4), 352, 351(2) ప్రకారం ఆమె పై కేసులు నమోదయ్యాయి. ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతోంది. సినీ రంగంలో గుర్తింపు తెచ్చుకున్న కల్పికపై ఇటువంటి ఆరోపణలు రావడంతో సినీ వర్గాల్లో కలకలం రేగింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి నిజాలు వెలుగులోకి వస్తాయో వేచిచూడాల్సిందే.
