NTV Telugu Site icon

Jyothika: కంగువా కంటే చెత్త సినిమాలు చాలా వచ్చాయి.. నటి జ్యోతిక ఫైర్..

Kanguva

Kanguva

Jyothika: తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువా మూవీ దారుణంగా ప్లాప్ అయింది. ఈ సినిమా మీద వచ్చిన విమర్శల మీద తాజాగా హీరో సూర్య భార్య జ్యోతిక ఫైర్ అయింది. భారీ బడ్జెట్ తో శివ డైరెక్షన్ లో వచ్చిన కంగువా సినిమా మీద రిలీజ్ కు ముందు బోలెడన్ని అంచనాలు ఉండేవి. ఇది కూడా మరో తంగలాన్ సినిమా అవుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరకు మూవీ బెడిసికొట్టింది. హిట్ కాదు కదా.. మూవీ మీద దారుణమైన ట్రోల్స్, విమర్శలు కూడా వచ్చాయి. సూర్య గత సినిమాలతో పోల్చి ఈ మూవీని దారుణంగా తిట్టారు.

Read Also: CM Yogi: యూపీ రైతులకు సీఎం శుభవార్త.. గోధుమ మద్దతు ధర పెంపు

తాజాగా ఆ విమర్శలపై జ్యోతిక స్పందిస్తూ.. ” కంగువా సినిమా కంటే చెత్త సినిమాలు చాలానే వచ్చాయి. కంగువా ఒక మంచి ప్రయత్నం. సూర్య ఈ సినిమా కోసం ఎంతో ఎఫర్ట్ పెట్టారు. మూవీ టీమ్ చాలా కష్టపడింది. ఒక కొత్త కాన్సెప్టుతో సినిమాను ప్రేక్షకులకు అందించాలి అనుకున్నారు. కానీ అది దురదృష్ట వశాత్తు ప్రేక్షకులకు నచ్చలేదు. చరిత్రలో కంగువా కంటే చెత్త సినిమాలు చాలానే వచ్చాయి. కానీ కంగువాను మాత్రమే చీల్చి చెండాడారు. కావాలనే టార్గెట్ చేసి విమర్శలు చేశారు’ అంటూ జ్యోతిక ఫైర్ అయింది. ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Read Also: CM Revanth Reddy : చేసిన తప్పులు, అప్పులను ఎన్ని రోజులు కప్పిపుచ్చుతారు

కంగువా సినిమా మీద అప్పట్లో జరిగిన రచ్చను ఇప్పుడు జ్యోతిక మళ్లీ తట్టిలేపినట్టు అయింది. ఆ సినిమా రిలీజ్ సమయంలో స్వయంగా జ్యోతికనే ఫస్టాఫ్ బాగా లేదని రివ్యూ ఇచ్చింది. ప్రస్తుతం సూర్య వరుస సినిమాలతో చాలా బిజీగా గడుపుతున్నాడు. దళపతి విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడంతో.. ఆ ప్లేస్ కోసం సూర్య గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. జ్యోతిక కోసం ముంబైకి షిఫ్ట్ అయిన సూర్య.. అక్కడి నుంచే తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజుతో రెట్రో అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. వరుస హిట్లతో ఉన్న సుబ్బరాజు తనకు కూడా హిట్ ఇస్తాడని సూర్య నమ్మకంతో ఉన్నాడు. మే 1న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.