NTV Telugu Site icon

Geeta Singh: అవకాశాలు వస్తే చేస్తా.. సినీ ఇండ‌స్ట్రీలో మేల్ డామినేష‌న్ ఎక్కువ‌..

Geeta Singh

Geeta Singh

Geeta Singh: కితకితలు, ఎవడి గోల వాడిదే, పోటుగాడు, శశిరేఖా పరిణయం, సీమ టపాకాయ్…’ వంటి పలు చిత్రాల్లో తన హాస్యంతో మెప్పించిన లేడీ కమెడియన్ గీతా సింగ్. అల్లరి నరేష్ సరసన ఆమె నటించిన ‘కితకితలు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. అయితే ఈ మధ్య కాలంలో ఆమె సినిమాల్లో కనిపించడం లేదు. ఈ విషయంపై ఆమె ఓ యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ తన పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read also: Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి

సినిమాల్లో ఎందుకు నటించడం లేదని ఆమెను ప్రశ్నించగా.. ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాలు రావడం లేదని అందుకే నటించడం లేదని చెప్పింది. ఇండస్ట్రీలో అతనికి ఎలాంటి సపోర్ట్ లేదు. సినిమా ఇండస్ట్రీలో మేల్‌ డామినేషన్‌ ఎక్కువ. ఇతర భాషల నుంచి లేడీ కమెడియన్లను ఎందుకు తీసుకురావాలి? ఇక్కడ మేము ఆల్‌ రెడీ ఫ్రూవ్‌ చేసుకున్నాం కదా.. మాకు అవకాశాలు ఇవ్వండి’ అని గీతా సింగ్ అన్నారు. తనని డబ్బు కోసం వాడుకున్నారని, నమ్మిన వారి చేతిలోదారుణంగా మోస పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకరి వద్ద చిట్టీలు వేస్తే రూ. 6 కోట్లకు మోసం చేశాడని తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చింది. మోసపోయిన తనకు ఆఫర్లు లేక, సరైన సమయంలో డబ్బులు అందక నరకం అనుభవించానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అవకాశాలు రావడంలేదని, వస్తే చేస్తానని.. చెప్పుకొచ్చింది. అన్నయ్య పిల్లలను దత్తత తీసుకుని వారి వద్దే ఉంటున్నట్లు గీతా సింగ్ తెలిపారు. అలాగే మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ తరపున EC మెంబర్‌గా అధిక మెజారిటీతో గెలిచానని, విష్ణు తన కాలేజీలో తన కుమారుడికి ఉచిత విద్యను అందిస్తున్నాడని చెప్పింది. వివాదాలకు దూరంగా ఉంటూ తనపని తాను చేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది కమెడిన్‌ గీతా సింగ్‌.
ICC Mens T20 World Cup 2022 Live: ప్రపంచయుద్ధం 2022… గెలుపెవరిది?