మహిళా కో-డైరెక్టర్‌ను వేధించారనే ఫిర్యాదుతో దర్శకుడు, అతని స్నేహితుడిపై మారాడు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. దర్శకులు సురేష్ తిరువళ్ల, విజిత్ విజయకుమార్‌లపై కేసు నమోదయింది. మావెలికరకు చెందిన ఓ స్థానిక యువతి ఫిర్యాదు మేరకు మారాడు పోలీసులు చర్యలు తీసుకున్నారు. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వేధించాడనేది కేసు పెట్టింది ఓ యువతి. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని విజిత్ తనపై రెండు సార్లు అత్యాచారం చేశాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక కమిట్మెంట్ కి సిద్ధం కావాలని సురేష్ తనను కోరినట్లు ఫిర్యాదులో పేర్కొంది. విజిత్ సినీ పరిశ్రమలో సెక్స్ రాకెట్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.
Hubballi riot: హుబ్బల్లి అల్లర్లు.. ఎంఐఎం నేతలపై కేసులు విత్‌డ్రా చేసిన కాంగ్రెస్ సర్కార్..
అదే సమయంలో, ఫిర్యాదుదారు ఆరోపణలను సురేష్ తిరువల్ల ఖండించారు. సురేశ్ మీడియాతో మాట్లాడుతూ ఫిర్యాదుదారుడిని తాను ఎప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదని, ఫిర్యాదును చూసి షాక్ అయ్యానని చెప్పారు. ‘నిజం చెప్పాలంటే నేను షాక్ అయ్యాను. నేను ఆమెను ప్రత్యక్షంగా చూడలేదు. కొత్త స్క్రిప్ట్‌ని పూర్తి చేసిన తర్వాత హీరో -హీరోయిన్‌ను నిర్ణయించే చర్చలో ఉన్నప్పుడు ఒక స్నేహితుడు వారికి నా నంబర్ ఇచ్చాడు. వాళ్లను ప్రత్యక్షంగా చూస్తాను అని చెప్పగానే.. నేను బిజీగా ఉన్నానని, వాళ్లను చూసిన తర్వాత ఏ పాత్రలో నటించాలో నిర్ణయిస్తానని చెప్పాను అంతే అని సురేష్ అన్నారు. ఈ ఫిర్యాదు వెనుక స్వార్థం ఉండొచ్చని, విజిత్, ఫిర్యాదుదారుడికి మధ్య ఏదైనా సమస్య ఉందో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు.