NTV Telugu Site icon

ఇకపై అలాంటి కథా చిత్రాల్లోనే నటిస్తాను: అంజలి

టాలీవుడ్ హీరోయిన్ అంజలి రీసెంట్ గా నటించిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలక పాత్రలో కనిపించారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. నివేదా థామస్‌, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి వస్తున్న ఆదరణ పట్ల నటి అంజలి ఆనందం వ్యక్తం చేసింది. ‘వకీల్‌సాబ్‌ నేను ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా. నా కెరీర్ లో ఓ మైలురాయిలా నిలుస్తుంది. ఇకపై మంచి కథా బలం ఉన్న చిత్రాల్లోనే నటిస్తాను. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ అంజలి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.