కొచ్చిలో అరెస్ట్ అయిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ఓం ప్రకాష్‌పై నమోదయిన డ్రగ్స్ కేసులో రిమాండ్ రిపోర్టులో మలయాళ సినీ తారల పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. నటి ప్రయాగ మార్టిన్, నటుడు శ్రీనాథ్ భాసీ ఓం ప్రకాశ్ హోటల్ రూమ్ ని సందర్శించారు. వీరితో పాటు మహిళలు సహా దాదాపు 20 మంది ఓం ప్రకాష్ గదికి వెళ్లారని చెబుతున్నారు. బాబీ చలపతి పేరు మీద గది బుక్ చేయగా డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓం ప్రకాష్ గదికి వచ్చిన వ్యక్తులను విచారణ బృందం విచారించాలని డిమాండ్ వినిపిస్తోంది. కొచ్చిలోని ఓ సెవెన్ స్టార్ హోటల్ నుంచి ఓం ప్రకాష్, అతని స్నేహితుడు షిహాస్‌లను మత్తు పదార్థాలు కలిగి ఉన్నందుకు పోలీసులు నిన్న అరెస్టు చేశారు.
Pottel: పొట్టేల్ దిగుతోంది.. ఎప్పుడంటే?
వారి బెయిల్ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. ఈ రిమాండ్ రిపోర్టులో సినీ తారల పేర్లు ఉన్నాయి. నిందితులు షిహాస్, ఓం ప్రకాష్‌లను అదుపులోకి తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు. అయితే ఇద్దరికీ బెయిల్ మంజూరు చేయబడింది. ఇక మూడు గదుల్లో డ్రగ్స్ విక్రయాలు జరిగాయి. నిందితుడి నుంచి కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు విదేశాల నుంచి డ్రగ్స్ తెప్పించి పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. వారు బుక్ చేసిన గదిలోనూ, పక్కనే ఉన్న రెండు గదుల్లోనూ విచారణ జరుపుతున్నారు. పోలీసులు హోటల్‌లోని సీసీటీవీలను పరిశీలించినట్లు సమాచారం. ఇతర పత్రాలను కూడా తనిఖీ చేశారు. దీన్ని బట్టి సినీ స్టార్స్ గురించి సమాచారం బయటకు వచ్చింది. ఓ స్టార్ హోటల్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే అనుమానంతో నార్కోటిక్స్ విభాగం సోదాలు నిర్వహించింది.