Surya teja: రచయితగా మారిన శంభో శివ శంభో నటుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘వినాయకుడు’, కల్ట్ క్లాసిక్ ‘శంభో శివ శంభో’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటుడు సూర్య తేజ్. కెమెరా ముందు తనదైన నటనతో మెప్పించిన ఈ యాక్టర్, ఇప్పుడు ఒక సరికొత్త అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. మహారాష్ట్రలోని అత్యంత ప్రసిద్ధి చెందిన “నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి” ఆలయ వైభవాన్ని, దాని చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా అక్షరబద్ధం చేసి, పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ప్రపంచంలోనే మొట్టమొదటి రచయితగా సూర్య తేజ్ అరుదైన ఘనత సాధించారు. తన తొలి పుస్తకమైన ‘నాగపూర్ పవిత్ర తేక్డి గణపతి’ని కేవలం ఒక భక్తి పుస్తకంగానో లేదా సంప్రదాయ కథనంగానో కాకుండా.. జీవితాన్ని ప్రాక్టికల్ గా ఎలా ఎదుర్కోవాలో వివరించే మార్గదర్శిగా ఆయన మలిచారు.
“గణపతి అంటేనే జ్ఞానానికి ప్రతీక.. ఆ ఓర్పు, జ్ఞానంతో మన నిత్య జీవితంలోని సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చు” అనే అద్భుతమైన కోణాన్ని ఈ పుస్తకంలో ఆవిష్కరించారు. ఇటీవలే రీ-రిలీజ్ అయిన ‘శంభో శివ శంభో’ ఘన విజయం సాధించిన సంతోషంలో ఉన్న సూర్య తేజ్‌కు, రచయితగా మారడం తన జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని వెల్లడించారు. తన భవిష్యత్ ప్రణాళికల గురించి చెబుతూ సూర్య తేజ్ మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారితో సన్నిహితంగా ఉంటూ, ఆయన ప్రవేశపెట్టిన దార్శనిక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానని రాబోయే రోజుల్లో భారతీయ రైతులు, గ్రామీణ యువత ఆర్థికంగా ఎలా బలపడాలి? అందుకు ఉపయోగపడే పటిష్టమైన విధానాలు ఏమిటి? అనే సామాజిక అంశాలపై మరిన్ని పుస్తకాలు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!