NTV Telugu Site icon

Sreenath Bhasi: మంజుమ్మల్ బాయ్స్ నటుడు అరెస్ట్.. అసలు ఏమైందంటే?

Srinath Arrest

Srinath Arrest

Sreenath Bhasi Arrest: హిట్ అండ్ రన్ కేసులో మలయాళ మంజుమ్మల్ బాయ్స్ సినిమా నటుడు శ్రీనాథ్ భాసిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసినట్లు సమాచారం. మట్టంచేరి ప్రాంతానికి చెందిన ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఘటన గత నెలలో కొచ్చిలో చోటుచేసుకుంది. సెప్టెంబర్ 8న రాంగ్ డైరెక్షన్‌లో వస్తున్న భాసీ కారు ఫిర్యాదుదారు స్కూటర్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిందని ఆరోపించారు. ఈ ప్రమాదంలో ఫిర్యాదుదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో నటుడిపై ఎలాంటి తీవ్రమైన అభియోగాలు నమోదు కాలేదని, సాధారణ ప్రక్రియలో భాగంగా నటుడిని పిలిపించి అరెస్టు చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు.

Ananya Panday : బ్లాక్ డ్రెస్సులో కనిపించి కనిపించని అందాలతో అదరహో అనిపిస్తున్న అనన్య

గతంలో డ్రగ్స్ కేసులో ఓం ప్రకాష్‌ అరెస్ట్ అయినప్పుడు కూడా శ్రీనాథ్ భాసీపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అరెస్టయిన బిను జోసెఫ్‌తో శ్రీనాథ్ భాసీకి ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. అయితే శ్రీనాథ్ భాసి, ప్రయాగ మార్టిన్‌లపై ఎలాంటి ఆధారాలు లభించలేదని కొచ్చి సిటీ పోలీస్ కమిషనర్ పుట్టా విమలాదిత్య తెలిపారు. ఎలమక్కకు చెందిన బిను జోసెఫ్‌ అనే వ్యక్తి శ్రీనాథ్‌ భాసి, ప్రయాగ మార్టిన్‌లను కొచ్చిలోని హోటల్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని లోతుగా విచారించారు. ఆ తర్వాత శ్రీనాథ్ భాసి, ప్రయాగ మార్టిన్‌లను మారాడు పోలీసులు విచారించారు. శ్రీనాథ్ వాంగ్మూలాల్లో పొంతన ఉన్నట్లు పోలీసులు తేల్చారు. బిను జోసెఫ్‌తో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు శ్రీనాథ్ కూడా అంగీకరించాడు.

Show comments