Site icon NTV Telugu

ఉద్యమాల నటుడు ఆర్. నారాయణమూర్తి అరెస్ట్

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం నిర్వహించారు. వాళ్లకు మద్దతుగా ఆ ర్యాలీలో ఉద్యమాల సినీనటుడు ఆర్‌. నారాయణమూర్తి కూడా పాల్గొన్నారు. పోలీసులు ముందస్తు హెచ్చరికలు చేసిన.. రాజ్ భవన్‌కు వెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనాకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆర్‌. నారాయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోపలికి వెళ్లేందుకు వీలు లేదని పోలీసులు చెపుతున్న వినకపోవడంతో.. ఉద్యమకారులందరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ.. వ్యవసాయం, విద్యా, వైద్యంను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని తెలిపారు.

Exit mobile version