Site icon NTV Telugu

‘సూపర్ మ్యాన్, డెలివరెన్స్’ చిత్రాల టాలెంటెడ్ యాక్టర్, నెడ్ బెట్టీ మృతి

‘ద సూపర్ మ్యాన్’, ‘డెలివరెన్స్’ చిత్రాలతో హాలీవుడ్ లో మంచి గుర్తింపు పొందిన నటుడు నెడ్ బెట్టీ. ఆయన ఆదివారం ఉదయం మరణించారు. 83 ఏళ్ల వయస్సులో ఆయన స్వంత ఇంట్లోనే కుటుంబ సభ్యుల నడుమ తుది శ్వాస విడిచారు. అతడి ఆరోగ్య సమస్యల గురించి ఇంకా సరైన సమాచారం లేదు. అయితే, నెడ్ బెట్టీ ఇక లేరనే విషయాన్ని మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ కన్ ఫర్మ్ చేశారు.
దశాబ్దాల పాటూ, నెడ్ ఎన్నో చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు. వాటిల్లో చాలా మరుపురాని పాత్రలున్నాయి. 50 ఏళ్లకు పైగా హాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆయన ‘ద సూపర్ మ్యాన్, డెలివరెన్స్’ చిత్రాల్లో మాత్రమే కాక ‘నెట్ వర్క్, టాయ్ స్టోరీ 3, రూడీ’ లాంటి మరెన్నో మూవీస్ చేశాడు. ‘నెట్ వర్క్’లో ఆయన క్యారెక్టర్ కిగానూ ఒక ఆస్కార్ నామినేషన్ కూడా లభించింది. తన సుదీర్ఘ నట జీవితంలో నెడ్ బెట్టీ అనేక టెలివిజన్ షోస్ కూడా చేశాడు. గెస్ట్ రూల్సే కాకుండా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ తో అమెరికన్ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. సొషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ఆయనకు నెటిజన్స్ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు…

Exit mobile version