Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Actor Krishnam Raju Passed Away At Age 83

Rebel star Krishnam Raju: ఎంద‌రికో స్ఫూర్తి.. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌జీవితం!

Published Date :September 11, 2022 , 7:15 am
By Subbarao N
Rebel star Krishnam Raju: ఎంద‌రికో స్ఫూర్తి.. రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు న‌ట‌జీవితం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆ రోజుల్లో ఆర‌డుగుల ఎత్తు, భారీ విగ్ర‌హంతో అల‌రించిన ఏకైక హీరో కృష్ణంరాజు. ఆయ‌న పేరు విన‌గానే కొంద‌రిలో ఉత్సాహం ఉర‌క‌లు వేసేది, కొంద‌రు జ‌డుసుకొనేవారు, మ‌రికొంద‌రికి ఆయ‌న అభిన‌యం ఆనందం పంచేది. ఇంకొంద‌రిని ఆయ‌న న‌ట‌న మురిపించేది. ఆరంభంలోనే కె.ప్ర‌త్య‌గాత్మ రూపొందించిన‌`చిల‌క‌-గోరింక‌`(1966)తో హీరోగా తెర‌పై త‌ళుక్కుమ‌న్నారు కృష్ణంరాజు. అయితే ఆ త‌రువాత క‌థానాయ‌కునిగా నిల‌దొక్కుకోవ‌డానికి కృష్ణంరాజు ప‌డ‌రాని పాట్లు ప‌డ్డార‌నే చెప్పాలి. దాదాపు ప‌దేళ్ళ‌కు కృష్ణంరాజు స్టార్ డ‌మ్ చూశారు. జ‌నం మ‌దిలో `రెబ‌ల్ స్టార్`గా నిలిచారు.

తెలుగు చిత్ర‌సీమ‌లో స్టార్ డ‌మ్ కోసం దాదాపు పుష్క‌ర‌కాలం ప్ర‌య‌త్నాలు సాగించి, విజేత‌లుగా నిల‌చిన‌వారు ఇద్ద‌రే ఇద్ద‌రు- వారు శోభ‌న్ బాబు, కృష్ణంరాజు. ఈ ఇద్ద‌రు హీరోల‌ను అప్ప‌ట్లో య‌న్టీఆర్, ఏయ‌న్నార్ బాగా ప్రోత్స‌హించారు. వారిచిత్రాల‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తూ త‌మ ఉనికిని చాటుకున్నారు. అయినా స్టార్ డ‌మ్ చేరుకోవ‌డానికి చాలా ఏళ్ళు ప‌ట్టింది. శోభ‌న్ బాబు హీరోగా, సైడ్ హీరోగా, కేరెక్ట‌ర్ యాక్ట‌ర్ గా సాగుతూ చివ‌ర‌కు `తాసిల్దార్ గారి అమ్మాయి`తో స్టార్ డ‌మ్ చూశారు. అయితే కృష్ణంరాజుకు హీరోవేషాలు అంత‌గా ద‌క్క‌లేదు. అయినా కృష్ణంరాజు నిరాశ చెంద‌లేదు. త‌న‌కు ల‌భించిన విల‌న్ రోల్స్ లోనూ అద్భుతంగా న‌టించి మెప్పించారు. ఆ రోజుల్లో కృష్ణంరాజును విల‌న్ గా తెర‌పై చూసిన మ‌హిళా ప్రేక్షకులు ఆయ‌న పేరు చెప్ప‌గానే జ‌డుసుకొనేవారు. అలాంటి కృష్ణంరాజు ఆ ముద్ర నుండి బ‌య‌ట ప‌డ‌డానికి `కృష్ణ‌వేణి, అభిమాన‌వంతులు, మేమూ మ‌నుషుల‌మే` వంటి చిత్రాల‌లో సాఫ్ట్ కేరెక్ట‌ర్స్ పోషించారు.

ఈ చిత్రాల‌లో`కృష్ణ‌వేణి` మిన‌హా ఏ చిత్ర‌మూ విజ‌యం సాధించ‌లేదు.అయినా మెల్ల‌గా కృష్ణంరాజును కూడా హీరోగా చూడ‌డానికి జ‌నం అల‌వాటు ప‌డేలా చేసుకున్నారు. ఆ త‌రువాత `భ‌క్త క‌న్న‌ప్ప‌`తో న‌టునిగా జ‌నం మెదిని మెప్పించ‌డ‌మే కాదు, స్టార్ డ‌మ్ నూ సొంతం చేసుకున్నారు. `అమ‌ర‌దీపం` చిత్రంతో నంది అవార్డుల్లో తొలి ఉత్త‌మ‌న‌టునిగా నిలిచారు. ఆ పై మాస్ సినిమాల‌తోనూ ఆక‌ట్టుకోవ‌డం మొద‌లెట్టారు. దాస‌రి నారాయ‌ణ‌రావు రూపొందించిన “క‌ట‌క‌టాల రుద్ర‌య్య‌, రంగూన్ రౌడీ“ చిత్రాలు కృష్ణంరాజును `రెబ‌ల్ స్టార్`గా నిలిపాయి. ఆ త‌రువాత నుంచీ ఆయ‌న మ‌రి వెనుదిరిగి చూసుకోలేదు.

Read Also: Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

ఇలా కృష్ణంరాజు సినీప్ర‌యాణం త‌రువాతి రోజుల్లో ఎంద‌రో హీరోల‌కు స్ఫూర్తిగా నిల‌చింది. కృష్ణంరాజు స్ఫూర్తితోనే చిరంజీవి, ర‌వితేజ‌, శ్రీ‌కాంత్ వంటివారు తొలుత చిన్న వేషాలు, విల‌న్ రోల్స్ చేసినా త‌రువాత హీరోలుగానూ, అటుపై స్టార్స్ గానూ రాణించారు. ఆ తీరున ప్ర‌స్తుతం చిత్ర‌సీమ‌లో ప్ర‌వేశిస్తున్న ఎంద‌రో న‌టుల‌కు కృష్ణంరాజు చ‌ల‌న‌చిత్ర జీవితం ప్రేర‌ణ‌గా నిల‌చింద‌ని చెప్ప‌వ‌చ్చు.
Heavy Rains: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • actor krishnam raju
  • ctor krishnam raju dead
  • krishnam raju died

తాజావార్తలు

  • Mrunal Thakur: లవ్‌ లైఫ్‌పై ఓపెన్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌.. అన్ని హద్దులు దాటే సమయం వచ్చేసింది..!

  • Aasman : శ్రీహరి కొడుకు హీరోగా ‘ఆస్మాన్’ మూవీ ప్రారంభం

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • PM Modi: ‘‘కేరళ స్టోరీ నుంచి ధురంధర్ వరకు..’’ అబద్ధాలు చెప్పడమే లెఫ్ట్, కాంగ్రెస్ పని..

  • Dunkin: భారత్ మార్కెట్‌కు గుడ్ బై చెప్పిన ప్రముఖ కాఫీ స్టోర్ దిగ్గజం.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions