కేరళలోని వయనాడ్ జిల్లాలో వరదలు కారణంగా కొండచరియలు విరిగి పడి వందల మంది చనిపోగా వేల సంఖ్యలో గాయాలపాలయ్యారు. అర్ధరాత్రి గాఢనిద్రలో ఉండగానే వారిపై విరుచుకుపడిన ప్రకృతి విపత్తు, ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఈ విషాద ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువరు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు వివిధ రంగాల సెలబ్రిటీలు వయనాడ్ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వయనాడ్ బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.
Also Read: Sandal Wood: ఇదెక్కడి విడ్డూరం.. కుక్క సినిమాకు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడైనా చూసారా..?
టాలీవుడ్ ఇండస్ట్రీ కేరళ వరద భాదితులు సహాయార్థం తమ వంతు భాద్యతగా కదిలి వచ్చారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిపి కోటి రూపాయల ఆర్థిక సాయం చేశారు. ఇక గ్లోబల్ స్టార్ రెబల్ స్టార్ ప్రభాస్ రాజు ఏకంగా 2 కోట్ల రూపాయల ఆర్ధిక సాయం చేసి రియల్ బహుబలి అనిపించారు. అటు కోలీవుడ్ నటీనటులు వయనాడ్ భాదితులకు పెద్ద మొత్తంలో విరాళాలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. తమిళ హీరో సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం అందించారు. తాజగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వయనాడ్ వరద భాదిధుల కోసం తన వంతుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు.స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎంతగానో ఆదరించే ప్రజలు, కష్టాలలో ఉన్నప్పుడు సినీ తారలు ఇలా ముందుకు వచ్చి భాదితులకు అండగా నిలవడం అభినందించదగ్గ విషయం.