NTV Telugu Site icon

Arvind Krishna: హీరో అరవింద్‌ కృష్ణకు అరుదైన పురస్కారం!

Arvind Krishna

Arvind Krishna

Actor Arvind Krishna Is Awarded Vegan Voice of India: ‘ఎ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ హీరో అరవింద్‌ కృష్ణకు అరుదైన పురస్కారం దక్కింది. ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారం అరవింద్‌ కృష్ణను వరించింది. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ ‘శుక్ర’, ‘సిట్‌’ ప్రాజెక్టులతో తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న నటుడు అరవింద్‌ కృష్ణ నటించిన ‘సిట్‌’ గత ఎనిమిది వారాలుగా జీ 5 ట్రెండింగ్‌లో ఉంది. గత కొన్నేళ్లుగా ఆయన అనుసరిస్తున్న వీగన్‌ లైఫ్‌స్టైల్‌కి అరుదైన గుర్తింపు దక్కింది. ఈ క్రమంలోనే ‘వీగన్‌ వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ పురస్కారాన్ని అందుకున్నారు అరవింద్‌ కృష్ణ. గత రెండేళ్లుగా వీగనరీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఇటీవల ముంబైలో జరిగిన వీగన్‌ ఇండియా కాన్ఫెరెన్స్ లోనూ పార్టిసిపేట్‌ చేశారు. అరవింద్‌ కృష్ణతో పాటు బాలీవుడ్‌ నటి జాక్వలిన్‌ ఫెర్ఫాండెస్‌ కూడా ఆ కాన్‌క్లేవ్‌లో ప్యానలిస్టుగా వ్యవహరించారు. ఈ క్రమంలో ‘వీగనిజమ్‌ నేను నమ్మే సిద్ధాంతం’ అని అన్నారు అరవింద్‌ కృష్ణ.

Saranga Dariya: భారతీయుడు 2 రిలీజ్ రోజే రాజా రవీంద్ర ‘సారంగదరియా’

ఆయన మాట్లడుతూ ”ఈ పురస్కారాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నా, నేను నమ్మిన సిద్ధాంతాన్ని ఇష్టంగా, మరింత సమర్థవంతంగా ఆచరించడానికి, నలుగురికీ పంచడానికి ఈ పురస్కారం నాలో బలమైన స్ఫూర్తి పంచుతోందని అన్నారు. ఇక నటుడిగా కెరీర్‌ని కొనసాగిస్తున్న హీరోల్లో ఏకైక బాస్కెట్‌ బాల్‌ ప్లేయర్‌గానూ అరవింద్‌కృష్ణకు అరుదైన గుర్తింపు ఉంది. ”కండరాల దృఢత్వానికి, గ్రౌండ్‌లో సమర్థవంతంగా ఆడటానికి, చురుకుగా వ్యవహరించడానికి నా వీగన్‌ జీవన శైలి ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రకృతి కోసం, నేను నమ్మే నైతికత కోసం వీగన్‌గా కొనసాగుతానని చెప్పారు అరవింద్‌ కృష్ణ. ”వీగనిజం నాకు అన్ని విధాలా ఉపయోగపడుతోంది. నా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతున్నాయని, గతంతో పోలిస్తే నేను శ్వాసించే విధానంలోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. అరవింద్‌ కృష్ణ ప్రస్తుతం ‘ఎ మాస్టర్‌పీస్‌: రెయిజ్‌ ఆఫ్‌ సూపర్‌హీరో’ ప్రాజెక్టు పనుల్లో బిజీగా ఉన్నారు.