Vallabhaneni Janardhan: ప్రముఖ నటుడు, దర్శకుడు వల్లభనేని జనార్దన్ అనారోగ్యంతో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. ప్రముఖ దర్శక నిర్మాత విజయబాపినీడు మూడవ కూతురు లళినీ చౌదరిని జనార్దన్ వివాహమాడారు. ఆయనకు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు. మొదటి అమ్మాయి శ్వేత. తను చిన్నతనంలోనే చనిపోయింది. రెండో కూతురు అభినయ ఫ్యాషన్ డిజైనర్ గా కొనసాగుతున్నారు. అబ్బాయి అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.
Read also: CM Jagan : అమిత్‌షాతో భేటీ కానున్న సీఎం జగన్
ఏలూరు దగ్గర పోతునూరులో వల్లభనేని జనార్దన్ 1959 సెప్టెంబర్ 25న జన్మించారు. తొలినుంచీ సినిమాలంటే ఎంతో ఆసక్తి. విజయవాడ లయోలా కాలేజ్ లో చదివారు. పట్టాపుచ్చుకొనేలోగానే ప్రపంచ సినిమాపై ఆసక్తి పెంచుకొని, పలువురు ప్రఖ్యాత దర్శకుల బాణీని ఔపోసన పట్టారు. సొంత సంస్థను స్థాపించి ‘మామ్మగారి మనవలు’ పేరుతో ఓ సినిమా మొదలు పెట్టాడు. ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత 21 ఏళ్ళ వయసులో కన్నడ హిట్ సినిమా ‘మానససరోవర్’ ఆధారంగా చంద్రమోహన్ హీరోగా ‘అమాయక చక్రవర్తి’ సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ తరువాత శోభన్ బాబు హీరోగా హిందీ ‘బసేరా’ను ‘తోడు-నీడ’గా రూపొందించారు. తన కుమార్తె శ్వేత పేరుమీద శ్వేత ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి “శ్రీమతి కావాలి, పారిపోయిన ఖైదీలు” చిత్రాలను రూపొందించారు. ‘శ్రీమతి కావాలి’ టైమ్ లో అనుకున్న ఆర్టిస్ట్ రాకపోవడంతో తనే నటుడుగా మారారు జనార్థన్. తన మామ విజయబాపినీడుతో కలసి ‘మహాజనానికి మరదలు పిల్ల’ చిత్రాన్ని తెరకెక్కించారు. రవితేజను హీరోగా నిలిపిన శ్రీను వైట్ల మొదటి సినిమా ‘నీ కోసం’కు నిర్మాణ సారథ్యం వహించారు.
Read also: Jamun Leaves: నేరేడు ఆకుల కషాయాన్ని తాగితే..
విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన అనేక చిత్రాలలో వల్లభనేని జనార్దన్ నటునిగా రాణించారు. చిరంజీవితో బాపినీడు తెరకెక్కించిన సూపర్ హిట్ ‘గ్యాంగ్ లీడర్’లో సుమలత తండ్రి పాత్రలో వల్లభనేని జనార్దన్ నటన అందరినీ అలరించింది. ఆ తరువాత వందకు పైగా చిత్రాల్లో చిన్నాచితకా పాత్రలు పోషిస్తూ సాగారు. జనార్దన్ కు సినిమా అంటే ఎంతో మక్కువ. అందువల్ల ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా నటించేవారు. ‘స్టూవార్ట్ పురం దొంగలు’ తో దాదాపు 100 వందు పైగా సినిమాలలో నటించారు జనార్థన్. చిరంజీవితో అనేక చిత్రాల్లో నటించిన జనార్దన్, బాలకృష్ణతో ‘లక్ష్మీనరసింహా’లోనూ, నాగార్జునతో ‘వారసుడు’లోనూ, వెంకటేశ్ తో ‘సూర్య ఐపీయస్’లోనూ అభినయించారు. సినిమాలలోనే కాకుండా ‘అన్వేషిత’ వంటి సీరియల్స్ లోనూ నటించి మెప్పించారు జనార్థన్.
Doc-1 Max Cough Syrup: ఉజ్బెకిస్తాన్‌లో భారత దగ్గు మందుతో 18 మంది పిల్లలు మృతి.. విచారణ ప్రారంభించిన ప్రభుత్వం