నేరేడు ఆకులు మధుమేహులకు గొప్ప వరంగా చెప్పవచ్చు.

నేరేడు ఆకులను ఉదయం పరగడుపున నాలుగు ఆకులు నమిలి మింగితే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. 

ఈ ఆకులను నలిపి ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఇలా తయారుచేసుకున్న ఈ ఆకుల కషాయాన్ని తాగితే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను కరిగించి బరువు తగ్గేలా చేస్తుంది. 

ఈ ఆకుల కషాయం తాగితే జిగట విరోచనాలు తగ్గుతాయి. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. 

ఈ ఆకుల కషాయంలో కొద్దిగా ధనియాలు కలిపి తాగితే జ్వరం త్వరగా తగ్గుతుంది. 

ఈ ఆకుల కషాయంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. 

ఈ ఆకుల కషాయం చక్కటి మౌత్ ఫ్రెష్నర్ గా పనిచేస్తుంది. ఈ ఆకుల కషాయం నోట్లో పోసుకొని పుక్కిలించి ఉసేస్తే అన్నిరకాల దంత సమస్యలు తగ్గిస్తుంది.. 

నేరేడు ఆకులను ఎండబెట్టి కాల్చి బూడిద చేయాలి ఈ పొడిని కొబ్బరినూనెలో కలిపి చర్మవ్యాధులు ఉన్నచోట రాస్తే త్వరగా తగ్గిపోతాయి. 

ప్రతి రోజూ రాత్రి ఈ నూనె రాస్తే గజ్జి, తామర, దురద, అన్ని రకాల చర్మ సమస్యలు, గాయాలు, పుండ్లు అన్ని తగ్గుతాయి.