ప్రిన్స్ మహేశ్ ను ఢీ కొట్టబోతున్న యాక్షన్ కింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’లో ప్రతినాయకుడి పాత్రధారి విషయంలో ఇంకా ఓ క్లారిటీ రాలేదు. మ్యూజికల్ ఛైర్స్ గేమ్ తరహాలో ఒక్కోసారి, ఒక్కో సందర్భంలో ఒక్కొక్కరి పేరు తెర ముందుకు వస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబుతో ఆన్ స్క్రీన్ పై పోరాడే వ్యక్తులు వీళ్ళే అంటూ కొన్ని పేర్లు వినిపించాయి. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ తో పాటు, ఆ మధ్య ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో నటించిన ఉపేంద్ర పేరూ పరిగణనలోకి వచ్చిందని అన్నారు. అలానే తమిళనాడుకు చెందిన పాపులర్ యాక్టర్ అరవింద్ స్వామి పేరుతో పాటు బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పేరు ఆ జాబితాలో కనిపించిందని కొందరు చెప్పారు. తాజాగా ఇప్పుడీ రూమర్స్ అన్ని కూడా కన్నడ స్టార్, యాక్షన్ హీరో అర్జున్ దగ్గర వచ్చి ఆగాయి. అర్జున్ ట్రాక్ రికార్డ్, అతని యాక్టింగ్ ఎబిలిటీస్ ను దృష్టి లో పెట్టుకుని మహేశ్ బాబు సరసన ఇతనైతే బాగుంటుందని యూనిట్ సభ్యులు ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇది కూడా గతంలో వచ్చిన పుకార్ల వంటిదేనా… లేకపోతే ఇందులో నిజం ఉందా లేదా అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఓపిక పట్టాల్సింది. ఇదిలా ఉంటే కీర్తి సురేశ్ నాయికగా నటిస్తున్న ‘సర్కార్ వారి పాట’లో వెన్నెల కిశోర్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2022 సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్స్ సైతం అప్ అండ్ డౌన్ అయ్యాయి. కృష్ణ బర్త్ డే సందర్భంగా మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ మే 31న వస్తుందని అభిమానులు భావించారు కానీ, కరోనా పేండమిక్ సమయంలో అలాంటి ప్రకటనలేవీ చేయొద్దని మహేశ్ బాబు చెప్పాడట. దాంతో ఇవాళ ఓ రకంగా కృష్ణ, మహేశ్ ఫ్యాన్స్ భారీ నిరాశకు గురయ్యారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న’సర్కార్ వారి పాట’ సినిమాను జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఫోర్టీన్ రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.
Also Read
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ... తీవ్ర ఆగ్రహం
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
- Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
తాజావార్తలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!