ప్రజంట్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ అభిరామి పేరు బాగా వినపడుతుంది. మణిరత్నం దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ‘థగ్‌లైఫ్’ మూవీతో అభిరామి కమల్ సరసన నటించి తిరిగి ఫామ్ లోకి వచ్చింది. జూన్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. అయితే ఈ ట్రైలర్‌లో ముఖ్యంగా కమల్ హాసన్, అభిరామి మధ్య ఘాటైన లిప్‌లాక్ సీన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. దీంతో ప్రజెంట్ జనరేషన్ వారు ఈ హీరోయిన్ గురించి సెర్చింగ్ మొదలు పెట్టారు..
Also Read: Samantha : గోల్డెన్ శారీలో మెరిసిపోయిన సామ్..
ఇక కేరళకు చెందిన అభిరామి అసలు పేరు దివ్య గోపికుమార్. 1995లో ‘కథపురుషన్’ అనే మలయాళ సినిమాలో బాలనటిగా కనిపించి ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. తెలుగులో ‘థ్యాంక్యూ సుబ్బారావు’, ‘చార్మినార్’, ‘చెప్పవే చిరుగాలి’ వంటి సినిమాల్లో నటించారు. ఇక 2009లో రాహుల్ పవనన్‌తో ఆమె వివాహం జరిగి, దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న అభిరామి.. 2014లో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చారు. నాటి నుంచి తన వయసు, ఇమేజ్, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని కథాబలమున్న చిత్రాలనే చేస్తూ వస్తున్నారు అభిరామి. కానీ అందం విషయంలో మాత్రం అలాగే ఉంది . 40 ఏళ్ళు దాటిన కూడా ఇప్పటికి యంగ్ లుక్ లో మెరుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇందులో భాగంగా తాజాగా తనకు సంబంధించిన ఫోటోలు పంచుకుంది.
