Abaddhameva Jayathe: భావోద్వేగాలతో ‘అబద్ధమేవ జయతే’ ‘అమ్మ కోసం’ సాంగ్ రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘అబద్ధమేవ జయతే’. ఈ సినిమాలోని ‘అమ్మ కోసం’ పాటను ప్రముఖ దర్శక-నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ పాట విడుదల అనంతరం తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ, “‘అమ్మ కోసం’ పాటలో మంచి భావోద్వేగం ఉంది. ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకేలా ఈ గీతం రూపొందింది. ఇలాంటి మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అబద్ధమేవ జయతే’ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందాలని కోరుకుంటున్నాను” అని ప్రశంసించారు. 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి కార్తీక్ కొండ కథ, కథనం అందించి దర్శకత్వం వహిస్తుండగా.. కొండ సందీప్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
గర్భవతిగా ఉన్న తన భార్యకు ఆడపిల్ల పుడితే అది అబద్ధాలు చెప్పిన వారికి శిక్ష అనే నమ్మకంతో, ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పకుండా జీవితంలో పూర్తి నిజాయితీగా జీవించాలని ప్రయత్నించే ఒక భర్త చుట్టూ ఈ కథ తిరుగుతుంది. పూర్తిగా నవ్వులు పంచడంతో పాటు ప్రేక్షకులను ఆలోచింపజేసే చక్కటి సందేశాన్ని కూడా ఈ సినిమా అందించనుంది. ఈ చిత్రంలో బాబు మోహన్, ప్రవణ్య రెడ్డి, సుశాంత్ యాష్కీ, భాను ప్రకాష్, వికాస్, విజయ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అమ్మ కోసం’ పాటకు చిత్రబృందం నుంచి విశేష స్పందన లభిస్తుండగా, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి కూడా అద్భుతమైన ఆదరణ దక్కుతుందని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్‌తో పాటు మరిన్ని ఆసక్తికరమైన విశేషాలను అధికారికంగా వెల్లడించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
Also Read
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. 'వారణాసి' ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
తాజావార్తలు
-
Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ ‘బాహుబలి’ వీడియో షేర్ చేసి..!
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్‌లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!