ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి. GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించారు. అంజి కె.మణిపుత్ర ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహించారు. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్ వంటి మూడు భారీ సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలైన ఆయ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Raed: Tollywood : వినాయక చవితి కానుకగా టాలీవుడ్ స్పెషల్ అప్ డేట్స్..
ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. సరికొత్త కథ కథాంశాలు ఉంటె టాలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారని ఆయ్ మరోసారి ప్రూవ్ చేసింది. చిన్నసి సినిమాగా విడుదలై దాదాపు రూ. 18 కోట్లు కలెక్ట్ చేసింది. ఒకవైపు థియేటర్స్ లో అడగుపెడుతూనే మరోవైపు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది ఆయ్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్.తాజాగా ఆయ్ డిజిటల్ ప్రీమియర్ డేట్ ను ప్రకటిచింది నెట్ ఫ్లిక్స్. ఈ నెల 12న ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకు రానుంది సదరు సంస్థ. థియేటర్లో చూడడం మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి