NTV Telugu Site icon

Aay: ఏపీ వరద బాధితులకు ‘ఆయ్’ సాయం.. ఎంతంటే?

Aay Movie

Aay Movie

AAY Movie team to Donate 25% Collections to AP Flood Victims: నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ చిత్రం మంచి టాక్ తెచ్చుకోడమే కాదు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్‌గా నటించగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు. గోదావరి ప్రాంత నేపథ్యంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించగా ఆడియెన్స్, విమర్శకుల నుండి ప్రశంసలతో పాటు, మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తండేల్ టీమ్ ఆయ్ యూనిట్‌ను అభినందించారు.

Devara: టైం చెప్పేశారు.. ఇక రెడీ అవండమ్మా!

ఈ సినిమా ఇప్పటికీ మంచి ఆక్యుపెన్సీ, డీసెంట్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఏపీలో చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ క్రమంలో ఈరోజు నుండి వారాంతానికి వచ్చే ఆయ్ కలెక్షన్లలో నిర్మాత వాటాలో 25% జనసేన పార్టీ ద్వారా వరద బాధితులకు అందజేస్తామని నిర్మాత బన్నీ వాస్, గీతా ఆర్ట్స్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి సాయంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ జానసేన ద్వారా బన్నీ వాస్ అండ్ టీమ్ వరద బాధితులకు ఆర్థిక సాయం చేయనుంది.

Show comments