Site icon NTV Telugu

Aamir khan : ‘సితారే జమీన్ పర్’ డిజిటల్ ప్లాన్ అదుర్స్.. కానీ వర్కౌట్ అవుతుందా ?

Sitare Zameen Par

Sitare Zameen Par

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘సితారే జమీన్ పర్’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. ఆర్‌.ఎస్‌. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించకపోయినప్పటికీ, ఓ క్లాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకుని క్లీన్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాపై అమీర్‌ ఖాన్‌ మొదటి నుంచి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సినిమా ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌కి అమ్మే ఆలోచన ఆయనకు మొదటి నుంచి లేదట. తన సినిమాను ఏ ఓటిటికీ ఇవ్వబోనని స్పష్టంగా చెప్పిన అమీర్‌, ఇప్పుడు తన మాట నిలబెట్టుకున్నారు.

తాజాగా “సితారే జమీన్ పర్”కి డిజిటల్ విడుదల తేదీని ఖరారు చేశారు. అయితే ఇది సాధారణ ఓటీటీలో కాదు.. యూట్యూబ్‌లో విడుదల కానుంది. ఆగస్ట్ 1 నుంచి ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులోకి రానుంది. కానీ ఇది ఉచితంగా కాదు సినిమాను చూడాలంటే ప్రేక్షకులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఓటీటీ ట్రెండ్ నుంచి పూర్తిగా భిన్నంగా అమీర్ తీసుకున్న ఈ నిర్ణయం పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫార్మాట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకర్షిస్తుందో, వాస్తవంగా ఇది వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

Exit mobile version