Site icon NTV Telugu

Aamir Khen : బాలీవుడ్ నుండి మరో భారీ ప్రజెక్ట్.. అదిరి పోయే అప్ డేట్ ఇచ్చిన ఆమిర్ ఖాన్

Ammer Khan

Ammer Khan

బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఎందో మనకు తెలిసిందే. గట్టి హిట్ కొట్టడంకోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రతి ఒక స్టార్ హీరో అండ్ హీరోయిన్ అని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ల్లో భారీ స్థాయిలో ‘రామాయణ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ పౌరానిక చిత్రం. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి రెండో భాగంను విడుదల చేయనున్నారు. అయితే సమాచారం ప్రకారం ఇప్పుడు ‘మహాభారతం’ కూడా రానుంది.

Also Read : Amardeep : బిగ్ బాస్ అమర్‌దీప్ హీరోగా కొత్త సినిమా

తాజాగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మహాభారతం’ రూపొందించడం తన కల అని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తెలిపారు. దీని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘భారతీయ ఇతిహాసానికి నేను ప్రాణం పోయాలనుకుంటున్నా. నేటితరానికి ‘మహాభారతం’ అందించాలనేది నా కల. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించానుకుంటున్నాను. దీని రైటింగ్‌కు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో దీన్ని చూపించలేం. అందుకే సిరీస్ లుగా దీన్నీ తెరకెక్కించాలి అని నిర్ణయించుకున్నాను. భారీస్థాయిలో ఈ ప్రాజెక్ట్ రానుంది. ఇండస్ట్రీలోని ఎంతోమంది దర్శకులు ఈ చిత్రం కోసం భాగం కానున్నారు. స్టోరీ రాసుకున్న తర్వాత పాత్రలకు ఎవరు సరిపోతారో చూసుకొని నటీనటులను ఎంపిక చేస్తాం. నేను నటిస్తానా లేదా అనేది ఇప్పుడే చెప్పలేను’ అని తెలిపాడు. ఇక అమిర్ ఖాన్ ఇలా సడెన్‌గా చెప్పడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version