Site icon NTV Telugu

స్టార్ హీరో కొడుకుతో నాగ చైతన్య టేబుల్ టెన్నిస్

Aamir Khan and Naga Chaitanya enjoy a Table Tennis tournament with the unit of Laal Singh Chaddha

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఓ స్టార్ హీరో కొడుకుతో టేబుల్ టెన్నిస్ ఆడిన పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రంతో నాగ చైతన్య బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ యువ నటుడు ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ నిమిత్తం లడఖ్ లో ఉన్నాడు. “లాల్ సింగ్ చద్దా” సిబ్బంది మొత్తం ఇటీవల తమ ఖాళీ సమయంలో సెట్లో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌ను ఏర్పాటు చేశారు. ఆ పిక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Read also : ఆర్య, సయేషా సైగల్ దంపతులకు పండంటి బిడ్డ

ఇందులో చైతన్య, అమీర్ ఖాన్ పాల్గొనడం మనం చూడవచ్చు. ప్రధాన నటుల నుండి సెట్లో ఉన్న పిల్లల వరకు జట్టు మొత్తం సరదాగా గడిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమీర్ ఖాన్ మాజీ భార్య, నిర్మాత కిరణ్ రావు, తన కుమారుడు ఆజాద్ రావు ఖాన్‌తో కలిసి సెట్స్‌లో టేబుల్ టెన్నిస్ ఆడాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన “లాల్ సింగ్ చద్దా” 1994లో వచ్చిన టామ్ హాంక్స్ చిత్రం “ఫారెస్ట్ గంప్” అధికారిక హిందీ రీమేక్. ఇందులో కరీనా కపూర్ ఖాన్, మోనా సింగ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version