Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!

Saikumar

Saikumar

వరస సినిమాలతో బిజీగా ఉన్న ఆది సాయికుమార్, ఈసారి ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌ను ఎంచుకున్నారు. తన సోషల్ మీడియా ద్వారా ఈ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను పంచుకుంటూ, సినిమా నేపథ్యంపై ఆసక్తిని పెంచారు. ఈ చిత్రం ఒక హాంటింగ్ (Haunting) థ్రిల్లర్ అని తెలుస్తోంది. “కొన్ని కథలు తలుపు తట్టి రావు.. అవి నిశ్శబ్దంగా వికసిస్తాయి.. శాశ్వతంగా వెంటాడుతాయి. అందం, రక్తం, చీకటితో నిండిన ఒక భయంకరమైన కథ ఇది”.. అంటూ ఈ అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తుంటే, సినిమా ఏ స్థాయిలో భయపెట్టబోతోందో తెలుస్తోంది.

గతంలో ‘శంభల’ చిత్రం కోసం పని చేసిన ప్యాషనేట్ టీమ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తోంది. ఆది సాయికుమార్ తన టీమ్‌పై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ఈసారి అంతకంటే పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. గతంలో ‘శంభల’తో మెప్పించిన ఈ టీమ్, ఇప్పుడు అంతకంటే పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమా పేరు.. ఇతర నటీనటుల వివరాలు వెల్లడికానున్నాయి.