Ego Raja : లుంగీ కట్టి మాస్ స్టెప్పులేసిన ఆది సాయికుమార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘శంబాల’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు రూట్ మార్చాడు. తన పాత ఇమేజ్ను పక్కనపెట్టి పక్కా రా అండ్ రస్టిక్ అవతారంలోకి మారిపోయాడు. గురు శరవణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగో రాజా’తో ఏకంగా కోలీవుడ్ బాక్సాఫీస్‌పై దండెత్తడానికి సిద్ధమయ్యాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ఆది కోలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ వదిలిన ‘రౌడీ రాకాసి’ క్యూట్ లవ్ సాంగ్ ఇప్పుడు నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ మెలోడీలో ఆది సాయికుమార్ లుక్, అతని ఎనర్జిటిక్ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే థియేటర్లలో మాస్ జాతర ఖాయమనిపిస్తోంది. ముఖ్యంగా లుంగీ కట్టి ఆది వేసిన ఊర మాస్ హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతోంది.
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ పాటను చిత్రీకరించిన తీరు యూత్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాసిన క్యాచీ లిరిక్స్‌కు, సంగీత దర్శకుడు గిబ్రాన్ వైబోధ అందించిన లైవ్లీ ట్యూన్ ప్రాణం పోసింది. దానికి తోడు సింగర్ శిభి శ్రీనివాసన్ గాత్రం పాటకు మరింత ఊపు తీసుకొచ్చింది. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత జి. సురేష్ అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి టెక్నికల్ టీమ్ పెద్ద బలం. స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస విజువల్స్, దురైరాజ్ ఆర్ట్ వర్క్, మేఘనాథన్ ఎడిటింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. విభిన్నమైన కథాంశంతో, అద్భుతమైన నటీనటుల ప్రదర్శనతో రాబోతున్న ఈ ‘ఈగో రాజా’ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
- Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
- Scene : 3 రోజుల్లో 145 కోట్లు..సూర్య అరాచకం: 'సీన్' మూవీపై మహేష్ బాబు రివ్యూ!
- Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..'ఫేక్' టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
తాజావార్తలు
-
Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..
-
SBI: ప్రవాసులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ఎస్బీఐ గ్రాండ్ ఎంట్రీ!
-
Polimera 3 : అనంత పద్మనాభుడి సాక్షిగా క్షుద్రపూజలు.. వేటాడేందుకు కత్తి పట్టిన యాక్షన్ కింగ్!
-
Janhvi Kapoor: ఆ సర్జరీ చేయించుకునే వరకు అమ్మ నేను హీరోయిన్గా పనికిరానంది!
-
Telangana Rice Prices : బియ్యం ధరలకు బ్రేక్.. కిలోకు గరిష్ట ధరలు ఫిక్స్.!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!