NTV Telugu Site icon

‘SA10’ : బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సుశాంత్ ..

Sushanth

Sushanth

టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ గురించి పరిచయం అక్కర్లేదు. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో ఆయన కూడా ఒకరు. నాగార్జున సోదరుడి కొడుకుగా.. తెరంగేట్రం చేసిన ఈ హీరో.. కాళిదాసు, కరెంట్ లాంటి సినిమాలతో  మంచి విజయాలు అందుకున్నాడు. నటన పరంగా మార్కులు పడినప్పటికీ, స్టార్ హీరో క్రేజ్ అయితే రాలేదు. ఈ క్రమంలో అథిది పాత్రలు ఎంచుకుంటూ ‘అలా వైకుంఠపురం’. ‘బోలా శంకర్’, ‘రావణాసుర’ వంటి చిత్రాలలో నటించాడు. కానీ ఇలా కూడా సుశాంత్‌కి ఫేమ్ రాలేదు. ఇక ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని, పూర్తి కొత్త జానర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు .

Also Read: Prithiveeraj : సందీప్ రెడ్డి వంగా కి నేను జీవితాంతం రుణపడి ఉంటా

సుశాంత్  హీరోగా, త్విరాజ్ చిట్టేటి దర్శకత్వంలో  ‘SA10’  ఈమూవీ తెరకెక్కుతుంది. వరుణ్ కుమార్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రజెంట్  ప్రేక్షకులు థ్రిల్లింగ్, హారర్, సైకో మూవీస్ బాగా చూస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకుని సుశాంత్ కూడా అలాంటి హారర్ థ్రిల్లర్‌ కథను ఎంచుకున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా‌కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మెకర్స్. కాగా సుశాంత్ ఈ లుక్‌లో చాలా కొత్తగా కనిపించాడు. భయంకరమైన చీకటి వాతావరణంలో,  నిలబడి ఉన్న సుశాంత్ ప్రతిబింబం, కింద నీటిలో కనిపించగా.. అతని పాత్రలో ఓ మిస్టీరియస్ ఎలిమెంట్ దాగి అర్థమవుతుంది. మొత్తానికి ఈ సారి పక్క ప్లాన్నింగ్ సుశాంత్ రాబోతున్నట్లు‌గా తెలుస్తోంది. మరిక నెక్స్ట్ అప్డేట్ ఇంకా ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి.