Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్‌ స్టార్స్ కన్‌ఫ్యూజన్

Malayalam

Malayalam

ఒక్క హిట్ పడితే చాలు.. మార్కెట్ రూపురేఖలే మారిపోతాయి. కానీ అదే హిట్ తర్వాత వచ్చే సినిమాపై ఉండే ప్రెజర్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఇలాంటి సిట్యుయేషన్‌ ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లు సాధించినా నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌ ఓపెనింగ్‌, మూవీస్‌ రిలీజ్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సక్సెస్‌ గ్రాఫ్ పడిపోతుందేమోనన్న జంకు స్పష్టంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం, ప్రాపర్ ప్లానింగ్ కోసం వెతుకులాటలో ఒకరకమైన కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

సౌత్‌లో తనదైన ముద్ర వేసిన కళ్యాణి ప్రియదర్శన్ నెక్స్ట్ లైనప్ భారీగా ఉంది. ‘లోక: చాప్టర్ 1 – చంద్ర’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు అందరి చూపు ‘లోక: చాప్టర్ 2’ పై పడింది. ఈ సీక్వెల్ షూటింగ్ 2026 సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. మరోవైపు రణ్‌వీర్ సింగ్ సరసన జై మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-బడ్జెట్ జాంబీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ ద్వారా కళ్యాణీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో జయం రవితో ‘జీనీ’, కార్తితో ‘మార్షల్’ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇన్ని భారీ సినిమాలు చేతిలో ఉన్నా, సరైన ప్రొడక్షన్‌ ప్లానింగ్‌, రిలీజ్ టైమింగ్స్ మేనేజ్ చేయడం కళ్యాణికి పెద్ద సవాలుగా మారింది.

నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆయన నటించిన ‘అతిరాడి’ చిత్రం మే 2026లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ హిట్ ఇచ్చిన జోష్‌తో బాసిల్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఆయన పాన్-ఇండియా సినిమా చేయబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈలోగా నటుడిగా, దర్శకుడిగా పలు భాషల ప్రాజెక్ట్‌లతో బాసిల్ బిజీగా ఉన్నాడు.

మలయాళ స్టార్ నివిన్ పౌలీ మళ్లీ ట్రాక్‌లోకి వస్తూ బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ కొడుతున్నాడు. గిరీష్ ఎ.డి దర్శకత్వంలో మమితా బైజుతో కలిసి నటించిన రొమాంటిక్ కామెడీ ‘బెత్లెహాం కుటుంబ యూనిట్’ ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనితో పాటు ‘ప్రేమమ్‌’ వంటి ట్రెండ్ సెట్టర్ ఇచ్చిన ఆల్ఫోన్స్ పుత్రన్ దర్శకత్వంలో రేసింగ్ నేపథ్యంలో నివిన్ చేస్తోన్న 50వ సినిమా ‘విజయం’పై అంచనాలు భారీగా ఉన్నాయి. డెబ్యూ డైరెక్టర్‌ నిషాద్ ఫామీతో రూక్మిణి వసంత్ హీరోయిన్‌గా ‘NP51’ ఓపెనింగ్‌ పూజా సెర్మనీ కూడా ఈ మద్యే జరిగింది. ఇవే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ‘డియర్ స్టూడెంట్స్’ కూడా త్వరలోనే ఆడియెన్స్‌ ముందుకు రానుంది. కానీ ఒక్కటే.. రిలీజ్‌ డేట్స్‌ విషయంలో కన్‌ఫ్యూజన్‌.

యంగ్ అండ్ ఎనర్జిటిక్ యాక్టర్ నస్లేన్ ‘ప్రేమలు’ భారీ విజయంతో ఒక్కసారిగా స్టార్‌ హీరో అయిపోయాడు. ఆ తర్వాత చేసిన’లోక చాప్టర్ 1: చంద్ర’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ వి ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టికి టాకా’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వీటితో పాటు ‘లోక’ సీక్వెల్‌, మరికొన్ని మలయాళ, తమిళ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి. హిట్లు పడుతున్నా… రాబోయే సినిమాల రిలీజ్‌లు, ప్రకటనల విషయంలో కాస్త కన్‌ఫ్యూజన్ నెలకొన్నప్పటికీ, ఈ యంగ్ స్టార్స్ అందరూ సరైన టైమ్‌లో థియేటర్లలోకి వచ్చి మళ్లీ సక్సెస్‌ మ్యాజిక్‌ని రిపీట్ చేస్తారని ఫ్యాన్స్ ఆశిద్దాం…