NTV Telugu Site icon

Mollywood : యంగ్ హీరోకు పోటీగా వస్తున్న సీనియర్ హీరో

Mollywood

Mollywood

యంగ్ హీరోకు ఇప్పుడు సైడిచ్చిన ఆ సీనియర్ హీరోలు  అప్పుడు పోటీగా రాబోతున్నారు.  మాలీవుడ్ సీనియర్ హీరోలు జోజూ జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన సినిమా ‘నారాయణేంటే మూన్నాన్మక్కల్’. ఈ సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సడెన్లీ తప్పుకుంది. కొన్ని ఇష్యూస్ వల్ల పొంగల్ రేసు నుండి షిఫ్టైంది . జనవరి 16న బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహీర్ నటించిన పర్వీన్‌కూడు షప్పుతో పోటీగా రావాల్సిన ఈ సినిమా సైలెంట్‌గా సైడైపోయింది.

Also Read : Saif Ali Khan : సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.

‘పని’ తో రీసెంట్ దర్శకుడిగా హీరోగా హిట్ అందుకున్న జోజూ జార్జ్ నటించిన అప్ కమింగ్ మూవీ ‘నారాయణేంటే మూన్నాన్మక్కల్ పిక్చర్’ సంక్రాంతికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా నెక్ట్స్ మంత్ ఫిబ్రవరి 7న థియేటర్లలోకి సినిమా వస్తున్నట్లు ప్రకటించారు. ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఫిబ్రవరికి సినిమా షిఫ్ట్ కావడంతో బాసిల్ జోసెఫ్ అప్ కమింగ్ మూవీతో క్లాష్ వచ్చేట్లు కనిపిస్తోంది. సంక్రాంతికి బాసిల్ జోసెఫ్‌కు సైడిచ్చిన సీనియర్లు నెక్ట్స్ మంత్ టార్గెట్ చేస్తున్నారు. బాసిల్ హీరోగా వస్తున్న ‘పొన్మన్’ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకెళుతున్న బాసిల్ జోసెఫ్ దూకుడుకు అడ్డుకట్ట వేయబోతున్నారు సీనియర్స్ జోజూ అండ్ సూరజ్. ఫిబ్రవరి 7న నారాయణేంటే మూన్నాన్మక్కల్ సినిమాను తెస్తుండటంతో రెండు సినిమాలపై ఎఫెక్ట్ పడే అవకాశాలున్నాయని మల్లూవుడ్ ట్రేడ్ వర్గాల టాక్. పోటాపోటీగా రిలీజ్ అవుతున్న ఈ రెండు సినిమాలలో గెలుపెవరిదో తెలియాలంటే మరోకొద్ధి రోజుల్లో తేలనుంది.