Site icon NTV Telugu

Varun Sandesh: ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లింగ్ మూవీ..

February 7 2025 02 18t140247.644

February 7 2025 02 18t140247.644

టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు లవర్ బాయ్‌గా సినీరంగంలో మంచి ఇమేజ్ సంపాదించుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస ప్లాపులతో సినిమాలకు దూరమయ్యాడు. అలా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చిన వరుణ్ సందేశ్.. బిగ్ బాస్ రియాలిటీ షో తో తిరిగి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక ఇప్పుడిప్పుడే విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మరోసారి నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు.

Also Read:Keeravani : ఆస్కార్ విజేత కీరవాణి మ్యూజికల్ కాన్సర్ట్.. ట్రైలర్ రిలీజ్

ఇందులో భాగంగా ఇటీవల ‘విరాజి’ అనే ఇక సైకలాజికల్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు వరుణ్ సందేశ్. డైరెక్టర్ ఆద్యంత్ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రమోదిని, రఘు కారుమంచి, బలగం జయరాం,రవితేజ నానిమ్మల, వైవా రవితేజ వంటి నటినటులు కీలక పాత్రలు పోషించారు.గత ఏడాది ఆగస్టు 2న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కథ పరంగా బాగున్నప్పటికీ.. పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రిలీజ్‌కు ముందే టీజర్, ట్రైలర్, పోస్టర్ ద్వారా క్యూరియాసిటీ కలిగించిన ఈ సినిమాకు అంతగా రెస్పాన్స్ రాలేదు. ఇక తాజాగా ఈ మూవీ OTT లోకి రానుంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో లో ‘విరాజీ’ ఫిబ్రవరి 18 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. కానీ రూ.99 రెంటల్ విధానంలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది.ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రేక్షకులు హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ చిత్రాలనే బాగా ఆదరిస్తున్నారు. అలాంటి వారికి ఈ మూవీ మంచి కచ్చితంగా నచ్చుతుంది.

Exit mobile version