Site icon NTV Telugu

New Twist in Jani Master Case: జానీ మాస్టర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఫిల్మ్ ఛాంబర్‌లో భార్య ఫిర్యాదు

Jani Master Case

Jani Master Case

New Twist in Jani Master Case: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్‌ వచ్చిచేరింది.. బాధితురాలపై ఫిల్మ్‌ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్ గా పని చేయడం కోసం నా భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని తన ఫిర్యాదులో పేర్కొంది.. ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది.. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది.. నాకు అమ్మ వద్దు.. నాన్న వద్దు.. నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్ పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చింది.. నా భర్త జానీ మాస్టర్ ను ఇంటికి రాకుండా అడ్డుకునేది.. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేదని పేర్కొంది..

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

ఇక, బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్ ను నువ్వు ఇష్టపడితే.. ఆయన జీవితం నుంచి నేను వెళ్లిపోతాను అని చెప్పాను అన్నారు సుమలత.. కానీ, బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు.. మీరు నాకు వదిన అంటూ నమ్మించింది.. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్లతో బాధితురాలికి అక్రమ సంబంధం ఉందని ఆరోపించింది.. అయితే, ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు.. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది.. పేరున్న.. డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుందని.. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసిందంటూ ఫిర్యాదులో పేర్కొంది.. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. నాకు, నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్లదే బాధ్యత.. నాకు, నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుతున్నట్టు వెల్లడించారు సుమలత..

Exit mobile version