NTV Telugu Site icon

SS Thaman: థమన్ దెబ్బకి కొత్త ఉద్యోగం పుట్టిందిగా!

Thaman Effect

Thaman Effect

లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ నందమూరి తమన్ అలియాస్ తమన్ కారణంగా ఒక కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది. ఇదేంటి అని ఆశ్చర్యపోకండి నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకి తమన్ సంగీతం అందించాడు. ఆయన అందించిన సంగీతం తమకు బాగా నచ్చడంతో ఆయన కూడా నందమూరి కుటుంబంలో ఒకడే అంటూ నందమూరి ఫ్యాన్స్ తమన్ ను కాస్త నందమూరి తమన్ చేసేసారు. ఇది బానే ఉంది, కానీ ఇటీవల డాకు మహారాజు ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఒక సాంగ్ ప్లే చేసిన తర్వాత అక్కడే ఉన్న ఒక స్పీకర్ కింద పడిపోయింది. తమన్ అందించిన మ్యూజిక్ దెబ్బకు ఇలా జరిగింది అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

Pune: పూణేని వణికిస్తున్న గుల్లెయిన్-బారే సిండ్రోమ్ (GBS).. 54 మందికి నిర్ధారణ.. ఈ వ్యాధి లక్షణాలు..

అక్కడే ఉన్న తమ బాలకృష్ణ కూడా నవ్వుకుంటూ కనిపించారు. ఇప్పుడు ఈరోజు అనంతపురంలో సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఎక్కడ ఈ సౌండ్ స్పీకర్ కింద పడుతుందో అనే ఉద్దేశంతో ఈవెంట్ నిర్వహిస్తున్న శ్రేయస్ మీడియా సంస్థ ఒక వ్యక్తిని ఆ స్పీకర్లు కింద పడిపోకుండా నిలబెట్టింది. ఈ విషయాన్ని డైరెక్టర్ బాబి అబ్జర్వ్ చేసి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అందరూ తమన్ దెబ్బకి ఒక కొత్త ఉద్యోగం పుట్టుకొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో తమన్ సంగీతం అందించిన పాటలు ప్లే చేస్తున్నప్పుడు బాక్సులు కింద పడకుండా అలా సెట్ చేశారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి