NTV Telugu Site icon

Allu Arjun: అరాచకం సార్ ఇది.. బన్నీ కోసం 1600 కి.మీ సైకిల్ తొక్కుతూ?

Allu Arjun

Allu Arjun

ఒక్కోసారి హీరోల అభిమానులు చేసే పనులు చూస్తే ఓరి మీ అభిమానం సల్లగుండా అనకుండా ఉండలేం. గతంలో తమ అభిమాన హీరోలను కలిసేందుకు వందల కిలోమీటర్లను నడిచి వెళ్లిన అభిమానులను మనం చూశాం. ఇప్పుడు అలాంటి ఒక అభిమాని ఏకంగా ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ నుంచి అల్లు అర్జున్ ని కలిసేందుకు హైదరాబాద్ సైకిల్ మీద వచ్చాడు. ఈ విషయం అల్లు అర్జున్ దృష్టికి వెళ్లడంతో వెంటనే సదరు అభిమానిని కలిసి అతనికి పూలకుండీ బహుకరించాడు. అంతేకాక 1600 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చాడు అనే విషయం తెలిసి షాక్ అయ్యాడు. ఇక ఆ అభిమాని అల్లు అర్జున్ ను చూడగానే కన్నీళ్ల పర్యంతమయ్యాడు. తన అభిమాన హీరో కనిపించగానే కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునే ప్రయత్నం చేశాడు.

C 202 Movie: వెన్నులో వణుకు పుట్టించే ‘సి 202’ రిలీజ్ ఎప్పుడంటే?

వెంటనే అల్లు అర్జున్ సైకిల్ మీద వెళ్ళవద్దని తాను ఫ్లైట్ ఏదైనా బుక్ చేయిస్తానని తన స్టాఫ్ కి ఆ విషయాన్ని పురమాయించాడు. అంతేకాదు సైకిల్ ని ఏదైనా బస్సుకి బుక్ చేసి పంపే ప్రయత్నం కూడా చేయాలని వారికి వెల్లడించారు. అంతేకాక దారి ఖర్చులకు కొంత డబ్బు కూడా ఇస్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తోంది. అల్లు అర్జున్ ను చూసిన వెంటనే సదరు అభిమాని కళ్ళలో ఆనందం వెలకట్టలేనిది అని చెప్పొచ్చు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ కూడా తాను పుష్ప ప్రమోషన్స్ కి ఉత్తర్ ప్రదేశ్ వస్తే అక్కడ కలుస్తానని సదరు అభిమానికి మాట కూడా ఇచ్చాడు. ఏదేమైనా అభిమానానికి హద్దులు లేవు ఉండవు అంటే ఇదేనేమో.

Show comments