NTV Telugu Site icon

Pushpa 2: జస్ట్ 1000 మిస్.. 5 రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Pushpa 2 Runtime

Pushpa 2 Runtime

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తర్వాత అదే సినిమాకి సీక్వెల్ గా పుష్ప రెండో భాగాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించే ప్రయత్నం చేసి అందులో దాదాపు సక్సెస్ అయ్యారు. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప రెండోభాగం డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకరోజు ముందుగానే రాత్రి 9:30 గంటల నుంచి ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించడం జరిగింది. ఇక ఈ స్పెషల్ ప్రీమియర్స్ టాక్ పాజిటివ్గా రావడంతో ఆ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

KTR Exclusive Interview: కాంగ్రెస్‌ ఏడాది పాలనపై కేటీఆర్‌ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ..

పుష్ప 2 సినిమా ఇక ఐదు రోజులలో ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా వెల్లడిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా ఏకంగా ఐదు రోజులలో 922 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. నిజానికి 1000కోట్ల మార్క్ ఈరోజే అందుకుంటుందని ట్రేడ్ వర్గాల వారు భావించిన కాస్త వెనకబడింది. మొత్తం మీద ఈ సినిమా ఐదు రోజులలో 922 కోట్ల మార్క్ అందుకున్న మొట్టమొదటి సినిమా గా నిలిచింది. నిజానికి సినిమా మొదటి రోజు నుంచి రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.