Prithviraj Sukumaran : వారాణసి ఒక్క షాట్ కోసం నేను మహేశ్ 90 టేక్స్ తీసుకున్నాం

Varanasi

Varanasi

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా అంటేనే పర్‌ఫెక్షన్. ప్రతీ షాట్ తాను అనుకున్న విధంగా వచ్చేంత వరకు ఆయన అస్సలు వదిలిపెట్టరు. తాజాగా మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్  రాజమౌళి వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో విల్లడించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ చిత్రం వారణాసి షూటింగ్ విశేషాలను పృథ్వీరాజ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు

ఆ సీన్ గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. వారణాసిలో ఒక పర్టికులర్ షాట్ ఉంది. నేను, మహేశ్ తెల్లవారుజామునే షూటింగ్ ప్రారంభించాం. సాయంత్రం వరకు చేస్తూనే ఉన్నాం. కానీ ఆ రోజుకు ఆ షాట్ పూర్తి కాలేదు. దీంతో మరుసటి రోజు కూడా అదే షాట్ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. రాజమౌళి పర్‌ఫెక్షన్ కోసం ఆ ఒక్క షాట్ కోసమే మేము ఏకంగా 90 నుండి 97  కంటే ఎక్కువ టేకులు తీసుకున్నాం. రాజమౌళి ఇప్పటికి ఒక డెబ్యూ డైరెక్టర్స్ లాగా కష్టపడుతుండం చూసి ఆశ్ఛర్యం కలిగింది’ అని అన్నారు.  ఈ చిత్రంలో మహేశ్ ‘రుద్ర’ పాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఏకంగా రూ. 1400 కోట్ల భారీ బడ్జెట్‌తో, ఆఫ్రికా నుండి అంటార్కిటికా వరకు అనేక యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది వారణాసి. ఈ సినిమాతో ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు అవడం గ్యారెంటీ అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

×
×
Ad