Site icon NTV Telugu

Phanindra Narsetti : కాశీ ‘కబేళా’లో బ్రాహ్మణుడితో రేప్ అటెంప్ట్.. మా తప్పేం లేదంటున్న డైరెక్టర్!

8 Vasantarlu

8 Vasantarlu

ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన 8 వసంతాలు థియేటర్లలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలోని ఒక సీన్ విషయంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా సక్సెస్ మీట్‌లో సదరు జర్నలిస్ట్ సినిమా టీమ్‌ని ప్రశ్నించారు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో బ్రాహ్మణుడి వేషంలో ఉన్న ఒక వ్యక్తి రేప్ చేసేందుకు ప్రయత్నించడం, దానికి ముస్లిం వ్యక్తులు సహకరించడం, అది కూడా కబీర్‌లో రేప్ అట్టెంప్ట్ చేయడం లాంటి విషయాలు అభ్యంతరకరమని ఆయన చెప్పుకొచ్చారు. అయితే, సదరు సక్సెస్ మీట్‌కి హాజరుకాని దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి ఈ విషయం మీద సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Also Read:Kajol: రామోజీ ఫిలిం సిటీ ‘Haunted’ వ్యాఖ్యలపై కాజోల్ U Turn

సనాతన ధర్మానికి, వేద గ్రంథాలు రాయడంలో ఎంతో కృషి చేసిన బ్రాహ్మణ కమ్యూనిటీ అంటే తనకు చాలా గౌరవం ఉందని చెప్పుకొచ్చారు. అయితే, జర్నలిస్టులు ఎందుకు సినిమాలోని సీన్ విషయంలో ఒక కులాన్ని ఆపాదిస్తున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. మనుషులు తమ స్వభావం, ప్రవృత్తి రీత్యా క్రైమ్ చేస్తారు, అలా అని వారి కులం ప్రకారం కాదని అన్నారు. అందుకే తాను సీన్‌లో వేర్వేరు సామాజిక స్థితిగతులకు చెందిన వారు ఒక క్రైమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపించానని, ఏ కులాన్ని ఇక్కడ టార్గెట్ చేయలేదని వివరించారు.

Also Read:Dil Raju: ఐకాన్ లో అల్లు అర్జున్ లేడు?

అది ఒక కబేళా కాబట్టి దానికి సంబంధించిన క్యారెక్టర్‌లను రాసుకున్నానని చెప్పారు. అయినా సరే, ఇక్కడ కులాన్ని తీసుకురావాలని మీరు అనుకుంటే, రావణుడు ఎవరు? ఒక బ్రాహ్మణుడికి పుట్టినవాడు కాదా? ఆయన స్వయంగా శివుడికి మహాతపస్వి, ప్రతిరోజూ విభూతి పెట్టుకునే వాడు. అయితే, అతను మాత్రం సీతాదేవిని అపహరించలేదా? ఇదే విషయాన్ని నేను చెప్పాలనుకున్నాను. ఒక మనిషి తన స్వభావం, మానసిక స్థితిని బట్టి నేరం చేస్తాడు, తన కులం లేదా మతానికి సంబంధించి కాదు. మనుషుల స్వభావమే అది. యద్భావం తద్భవతి అనే విషయాన్ని ఇలా చెప్పాలనుకున్నాను. మీరు ఏం చూడాలనుకుంటున్నారో అదే కనిపిస్తుంది. కాబట్టి, మీ పర్స్పెక్టివ్ మార్చుకోండి. మేము అనుకోని విషయాలను మాకు ముడిపెట్టొద్దు. అక్కడ యాంకర్ ఆయన్ని పంతులు అని పిలవకుండా ఉండాల్సింది. పెద్దవారు మీరు కరెక్ట్ చేసి వదిలేయాల్సింది. అంతేకానీ, దాన్ని ఇక్కడిదాకా తీసుకువచ్చి ఉండాల్సింది కాదని చెప్పుకొచ్చారు.

Exit mobile version