ట్రెండింగ్ లో బాలయ్య ‘అఖండ’… 8 మిలియన్ వ్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ మూవీపై అభిమానులలో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఉగాది సందర్భంగా టైటిల్ రోల్ ‘అఖండ’ అంటూ ‘బీబీ3’ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ వీడియోను పోస్ట్ చేశారు మేకర్స్. ‘అఖండ’ టైటిల్, టీజర్ లో బాలకృష్ణ గెటప్, ఆయన డైలాగ్స్, థమన్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా బాలయ్య సినిమా టీజర్ అలా వచ్చి రాగానే వైరల్ అయిపోయింది. వ్యూస్ తో పాటు లైక్స్ కూడా భారీ సంఖ్యలో పెరిగిపోతున్నాయి. విడుదలైన కొన్ని గంటల్లోనే 8 మిలియన్ వ్యూస్ సాధించింది ‘అఖండ’ టీజర్. ప్రస్తుతం యూట్యూబ్ లో నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతోంది ‘అఖండ’ టీజర్. కాగా ‘అఖండ’లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. పూర్ణ, జగపతి బాబు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మే 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read
- Sukumar - DSP: దేవిశ్రీ ప్రసాద్ - సుకుమార్‌ల బంధానికి బ్రేక్ పడిందా? RC17 నుంచి DSP అవుట్!
- Rashmika Mandanna: గాయాలపై రష్మిక ఎమోషనల్ పోస్ట్.. అసలు ఏం జరిగిందో చెప్పిన స్టార్ హీరోయిన్!
- Mrunal Thakur: ఫ్రెండ్ రిసెప్షన్లో స్టార్ హీరోయిన్ రచ్చ! నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ డ్యాన్స్ వీడియో..
- Sujatha Vijayakumar: రవి మోహన్ విడాకుల కేసులో ఆర్తి తల్లి బిగ్ బ్లాస్ట్.. ఇన్నాళ్లూ బయటకు రాని విషయాలు ఇవేనంట!
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!