NTV Telugu Site icon

National Awards: బెస్ట్ తెలుగు సినిమాగా కార్తికేయ 2.. బెస్ట్ నటుడిగా రిషబ్ శెట్టి

Karthikeya

Karthikeya

70th National Film Awards 2024 Announcement Telugu: 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 అనౌన్స్మెంట్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. బెస్ట్ తెలుగు ఫిలింగా కార్తికేయ 2 సినిమా నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ తమిళ్ ఫిలిమ్ పొన్నియన్ సెల్వన్ 1 నేషనల్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా బెస్ట్ కన్నడ ఫిలింగా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఇక అదే సినిమాకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ క్యాటగిరీలో కూడా నేషనల్ అవార్డు దక్కింది. బెస్ట్ మరాఠీ సినిమాగా వాల్వి ఆ అవార్డు దక్కించుకోగా బెస్ట్ బెంగాలీ సినిమాగా కాబేరి అంతరార్థన్ అనే సినిమా అవార్డు దక్కించుకుంది.

Renu Desai: పవన్ తో వెళతానన్న ఆద్య.. అందుకే ఒప్పుకున్నానంటూ రేణు దేశాయ్ షాకింగ్ రియాక్షన్

బెస్ట్ మ్యూజిక్ క్యాటగిరీలో హిందీ బ్రహ్మాస్త్ర సినిమాకి గాను ప్రీతం అవార్డు దక్కించుకున్నాడు. బెస్ట్ లిరిక్స్ అవార్డు ఫోజా సినిమాకి గాను నౌషద్ సాధర్ ఖాన్ కి దక్కింది. బెస్ట్ ఎడిటింగ్ అవార్డు మలయాళ సినిమా ఆట్టంకి దక్కింది. కాంతార సినిమాలో నటనకు గాను రిషబ్ శెట్టికి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు లభించింది. తిరు సినిమాకి గాను నిత్యమీనన్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు దక్కింది. ఇక బెస్ట్ యాక్ట్రెస్ గా కచ్ ఎక్స్ప్రెస్ సినిమాకి గాను మానసి పరేఖ్ కి కూడా అవార్డు అనౌన్స్ చేశారు. వీరిద్దరూ కలిసి అవార్డు షేర్ చేసుకోబోతున్నారు మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే బెస్ట్ సినిమా అవార్డు కూడా మలయాళ సినిమా ఆట్టంకి దక్కింది.

Show comments