Site icon NTV Telugu

Pawan Kalyan: పవన్ బర్త్ డే కానుకగా సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్న’OG’ టీమ్

Untitled Design (84)

Untitled Design (84)

సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సారి ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ కానుంది. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. అంతేకాక పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. దీంతో పవన్ బర్త్ డే ను ఓ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు అయన అభిమానులు. అటు పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది.

కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా సినిమాలు కాస్త బ్రేక్ ఇచ్చాడు. అయితే ఇటీవల తన సొంత నియోజక వర్గమైన పిఠాపురంలోని ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని, ఆ సినిమా చాలా బాగుంటుంది మీ అందరికి తప్పకుండ నచ్చుతుందని వ్యాఖ్యానించారు, దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. ఎప్పుడెప్పుడు OG షూట్ లో తమ అభిమాన హీరో పాల్గొంటాడా అని ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే షూట్ లో పాల్గొంటానని అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోమని నిర్మాత DVV. దానయ్య కు పవర్ స్టార్ చెప్పినట్టు తెలుస్తుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ షూట్ లో జయిన్ అయితే షూట్ ఎక్కడ డిలే అవకుండా చకచక ఫినిష్ చేసేలా దర్శకుడు సుజిత్ అన్ని ఏర్పాట్లు ఫినిష్ చేసాడు. పవన్  బర్త్ డే తరువాత OG షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది. దానితో పాటు ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చేలా OG  షూటింగ్ తిరిగి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది  స్పెషల్  వీడియో రిలీజ్ చేయనుంది నిర్మాణ సంస్థ.

Exit mobile version