Site icon NTV Telugu

ఆచార్య: మణి బాణీలకు భారీ రెస్పాన్స్‌‌

కొర‌టాల శివ డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఆచార్య‌’. కాజ‌ల్ అగ‌ర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీలక పాత్రలో రాంచరణ్ నటిస్తున్నాడు. ఇప్పటికే చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, మరో పది రోజుల్లో షూటింగ్ పూర్తికానుంది. కాగా ఈ చిత్రం నుంచి విడుదల అయిన టీజర్, పాటకు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే.

Read Also: దేశవ్యాప్తంగా రెండో స్థానంలో అల్లు అర్జున్ ‘పుష్ప’!

తాజాగా లాహే.. లాహే పాట 60 మిలియన్స్ వ్యూస్ ను రాబట్టుకుంది. విడుదలైన మొదటి పాటకే ఇంతమంచి ఆదరణ లభించడంతో మేకర్స్ ఆనందపడుతున్నారు. శివుడిని స్తుతిస్తూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. మణిశర్మ అద్భుతమైన బాణీలు ఇచ్చారు. ఇక మెగాస్టార్ డాన్స్‌కు ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల‌వోక‌మైన స్టెప్పులతో అలరించారు. ఈ పాట‌ను హారిక నారాయ‌ణ్‌, సాహితీ చాగంటి ఆలపించారు. హీరోయిన్‌ కాజ‌ల్, సీనియ‌ర్ న‌టి సంగీత సంప్రదాయ వస్త్రధారణలో మెరిశారు.

Exit mobile version