NTV Telugu Site icon

Pushpa 2: పుష్ప దెబ్బ.. సెకన్లలో 426 కోట్ల లాభం?

Pushpa2 (6)

Pushpa2 (6)

ఈ ఏడాది అభిమానులు అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ చిత్రం పుష్ప 2 విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 5న ఈ సినిమాను దేశవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ముందుగానే ఈ సినిమా బుకింగ్ కూడా థియేటర్లలో మొదలైంది. నవంబర్ 30న ప్రారంభమైన బుకింగ్స్ ద్వారా మేకర్స్ దాదాపు రూ.25 కోట్లు రాబట్టారు. మొదటి రోజు ఆన్ లైన్ బుకింగ్స్ ద్వారానే ఫిల్మ్ మేకర్స్ రూ.60 కోట్ల వరకు రాబట్టవచ్చని అంచనా. అంటే పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా మొదట్లో రూ.150 నుంచి 200 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. పుష్ప 2 బుకింగ్స్ స్టాక్ మార్కెట్‌లో కూడా ఒక మంచి కిక్ తీసుకొచ్చింది. థియేటర్ చైన్ పీవీఆర్ ఐనాక్స్ షేర్లు దాదాపు 3 శాతం పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ కొద్ది నిమిషాల్లోనే రూ.426 కోట్లు పెరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసిందని స్టాక్ మార్కెట్ ప్రభావం చూస్తే తెలుస్తుంది. భారీగా జనాలను థియేటర్లకు రప్పించే శక్తి పుష్ప 2కి ఉంది. దీంతో థియేటర్లకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

YS Jagan: రేపు జగన్‌ అధ్యక్షతన వైసీపీ కీలక సమావేశం..

వసూళ్లు పెరిగితే థియేటర్ కంపెనీ షేర్లు పెరుగుతాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. బీఎస్ఈ డేటా ప్రకారం శుక్రవారం పీవీఆర్ ఐనాక్స్ షేర్ ధర రూ.1540 వద్ద ముగిసింది. సోమవారం కంపెనీ షేరు రూ.1,558 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత దాదాపు 3 శాతానికి చేరుకుంది. ట్రేడింగ్ సమయంలో షేరు ధర రూ.1583.40 గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం 2 గంటల సమయానికి 2.25 శాతం పెరిగి రూ.1,574.65 వద్ద ట్రేడవుతోంది. డిసెంబర్ 18, 2023న కంపెనీ షేరు 52 వారాల గరిష్ట స్థాయి రూ.1,829కి చేరుకుంది. ప్రస్తుతం, నిపుణులు PVR ఐనాక్స్ యొక్క స్టాక్ పుష్ప 2 తో కొత్త గరిష్టాన్ని తాకవచ్చని అంచనా వేస్తున్నారు. పీవీఆర్ ఐనాక్స్ షేర్ల ధర పెరగడంతో కంపెనీ మార్కెట్ విలువ కూడా పెరిగింది. శుక్రవారం పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,122.79 కోట్లుగా నమోదైంది. సోమవారం నాటి ట్రేడింగ్‌లో రూ.15,548.97 కోట్లను తాకింది. అంటే పీవీఆర్ ఐనాక్స్ మార్కెట్ విలువ కొద్ది నిమిషాల్లోనే రూ.426.18 కోట్లు పెరిగింది. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

Show comments