4 SOT Teams after Harsha Sai on Rape Case: తెలుగు యూట్యూబ్ స్టార్ హర్ష సాయి వ్యవహారం రోజు రోజుకి హార్ట్ టాపిక్ అవుతుంది. హర్ష సాయి మీద ఇప్పటికే పోలీసులు రేప్ కేసు నమోదు చేసి అతని కోసం ఆలిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులోకి రాకుండా హర్ష సాయి పరారీలో ఉన్నట్లుగా చెబుతున్నారు. హర్షసాయి కోసం 4 ఎస్‌వోటీ పోలీసు బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు.. బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్షాయి ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తోందని పోలీసులు చెబుతున్నారు.. హర్ష సాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని బాధితురాలి ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్ష సాయి యూట్యూబ్ లో పేదవారికి సహాయం చేసే వీడియోలు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు.
Harsha Sai: డబ్బు కోసం ఏమైనా చేస్తా.. నిస్సిగ్గుగా హర్ష సాయి కామెంట్స్.. మరో ఆడియో లీక్
అవసరం ఉన్నవారికి హర్ష సాయి అండగా ఉంటాడు అంటూ ఆయన అభిమానులు సైతం పెద్ద ఎత్తన ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి హర్ష సాయి హీరోగా, దర్శకుడిగా మారి మెగా అనే సినిమా తెరకెక్కించాడు. ఈ సినిమాలో గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ లో పాల్గొన్న మిత్ర శర్మ హీరోయిన్గా నటిస్తూనే నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఆమె హర్ష సాయి తనమీద అత్యాచారం చేశాడని, స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేస్తూ వీడియో రికార్డు చేసి దాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. అయితే అవన్నీ తప్పుడు ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుందని హర్ష సాయి గతంలో క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే హర్ష సాయి ఇప్పుడు పోలీసులకు అందుబాటులోకి రాకుండా పరారీలో ఉండడంతో ఆయన కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి.