Site icon NTV Telugu

Saif Ali Khan Attack Case: దాడి సమయంలో నలుగురు మగాళ్లు ఏం చేయలేదా?

Saif Ali Khan

Saif Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై బంగ్లాదేశ్ నివాసి మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ జనవరి 16న అతని ఇంట్లో కత్తితో దాడి చేశాడు. ఇందులో సైఫ్ అలీఖాన్‌కి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ అలీఖాన్‌ని ఆటోలో కొడుకు తైమూర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఈ కేసుకు సంబంధించి సైఫ్‌పై దాడి జరిగినప్పుడు ఇంట్లో మనుషులెవరూ లేరా? సొంత కార్లు ఉన్నప్పటికీ ఆటోలో ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడు? డ్రైవర్ లేడా? అనే అనుమానాలు ముందు నుంచి ఉన్నాయి. సైఫ్‌పై బంగ్లాదేశీయులు దాడి చేసిన సమయంలో, ఇంట్లో ఒక్కరు మాత్రమే కాదు నలుగురు మగ వ్యక్తులు ఉన్నారు.

Vinayakan: మందేసి రెచ్చిపోయిన జైలర్ విలన్.. చివరికి క్షమాపణలు !

వారు సైఫ్ ఇంటిలో రకరకాల పనులు చేస్తున్నారు. ఇక ఇండియా టుడేలో ప్రచురించిన వార్తల ప్రకారం, దాడి సమయంలో సైఫ్, కరీనా ఇంట్లో నలుగురు మగ వ్యక్తులు ఉన్నారట. అయితే సైఫ్‌ను కాపాడేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. ఒక మగ వ్యక్తి ఇంటి లోపల దాక్కున్నట్లు చెబుతున్నారు, మరికొందరు భయంతో నిశ్చేష్టులైపోయారట. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్‌ను ఇంట్లోని మహిళా సహాయకురాలు గదిలో బంధించిందని పోలీస్ వర్గాలు తెలిపాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మెట్ల మీదుగా 7-8వ అంతస్తు వరకు వెళ్లి డక్ట్ పైపు ద్వారా 11వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ అతను సైఫ్ చిన్న కొడుకు జెహ్ గదిలోని బాత్రూమ్ కిటికీలోంచి ఇంట్లోకి ప్రవేశించాడు. బాత్రూమ్ కిటికీకి గ్రిల్ లేని కారణంగా అతను ఇంట్లోకి ప్రవేశించడంలో సక్సెస్ అయ్యాడు.

Exit mobile version