NTV Telugu Site icon

35 MovieTrailer : 35 చిన్న కథ కాదు.. కానీ ట్రైలర్ మాత్రం పెద్దదే..

Untitled Design (6)

Untitled Design (6)

కేరళ కుట్టి నివేదా థామ‌స్ టాలీవుడ్ లో కొంత గ్యాప్ ’35 – చిన్న క‌థ కాదు’ అనే చిన్న సినిమాలో నటిస్తోంది. నందకిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ప్రియ‌ద‌ర్శి, విశ్వ కీల‌క పాత్ర‌ల్లో నటిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ ఎందుకని తప్పుకుంది. తాజగా ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 6న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్యక్రమాలు జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి.

Also Read: Bigboss : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రోమో.. కంటెస్టెంట్ లను చూస్తే ఆశ్చర్యపోతారు..

లేటెస్ట్ గా 35 చిత్ర ట్రైలర్ ను కింగ్ అక్కినేని నాగార్జున చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. ఈ చిత్రంలో నివేతా తల్లి పాత్రలో కనిపించింది. అందుకోసం బరువు కూడా పెరిగింది నివేతా థామస్. ట్రైలర్ ఆద్యంతం అద్భుతంగా సాగిందని చెప్పాలి. లెక్కలు రాని కొడుకు భవిష్యత్తుని తీర్చిదిద్దే తల్లిగా ఓడిపోవడం అనే మైనస్ నుండి గెలవడం అనే ప్లస్ వైపు అడుగులు వేస్తుంటే అందరికి ఎదురయ్యే మజిలీ సున్నా. దాన్ని దాటాలి అని నివేతా చెప్పిన డైలాగ్స్ హృదయాలను హత్తుకున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. 35 ట్రైలర్ ను ఓసారి చూసేయండి.

Show comments