గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటున్న 30 ఇయర్స్ పృథ్వీరాజ్ తాజాగా జరిగిన లైలా ఈవెంట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి గతంలో వైసిపికి అనుకూలంగా వ్యవహరించిన ఆయన ఎన్నికల్లో ప్రచారం కూడా నిర్వహించడంతో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో వైసీపీ పక్కన పెట్టింది. దీంతో వైసీపీ మీద సంచలన ఆరోపణలు చేసి జనసేనకు దగ్గరైన పృథ్వీరాజ్ మొన్నటి ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం చేశారు.
Allu Arjun – Trivikram: బన్నీ-త్రివిక్రమ్ సినిమా ఆపేశారా?
ఇక ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమా ఫంక్షన్ లో అయినా సరే వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్న ఆయన తాజాగా లైలా ఈవెంట్లో వైసిపి నేతలను మేకలతో పోలుస్తూ కామెంట్స్ చేశారు. దీంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో లైలా సినిమాని బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడిన మాటలకు తమకు సంబంధం లేదని హీరోతో పాటు నిర్మాత కూడా మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు కూడా సైలెంట్ గా ఉన్న పృథ్వీరాజ్ హాస్పిటల్ పాలైనట్లు తెలుస్తోంది. ఆయనకు హై బీపీ రావడంతో హుటాహుటిన సన్నిహితులు ఆయనని ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రికి సంబంధించిన విజువల్స్ సహా కొన్ని ఫోటోలు బయటకు వచ్చి వైరల్ అవుతున్నాయి.