Site icon NTV Telugu

గౌతమి లేకుండానే కమల్ “పాపనాశం-2” ?

Gauthami to not be a part of Papanasam-2

ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇప్పుడు “విక్రమ్” అనే సినిమాను చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం “విక్రమ్” కంటే ముందే కమల్ “పాపనాశం-2″ను పూర్తి చేయాలని భావిస్తున్నారట. అయితే “పాపనాశం”లో హీరోయిన్ రోల్ లో నటించిన గౌతమి సీక్వెల్ లో భాగం కాకపోవచ్చని అంటున్నారు. గౌతమి స్థానంలో మీనా పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారట. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతు జోసెఫ్ దర్శకత్వంలో వచ్చిన “దృశ్యం 2” అధికారిక తమిళ రీమేక్ “పాపనాశం-2”. దర్శకుడు జీతు జోసెఫ్ “పాపనాశం” చేసినప్పుడు… గౌతమి, కమల్ హాసన్ రిలేషన్ లో ఉన్నారు. అయితే 2016లో కొన్ని సమస్యల కారణంగా ఈ జంట విడిపోయారు. అందుకే ఈ సీక్వెల్ లో గౌతమి ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు దర్శకుడు జీతు జోసెఫ్, కమల్ హాసన్ సీక్వెల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి భాగాన్ని సహ నిర్మించిన నటి శ్రీప్రియా సీక్వెల్‌ను కూడా నిర్మించనుంది. “దృశ్యం”లాగే “పాపనాశం” కూడా భారీ హిట్ గా నిలిచింది. గత సంవత్సరం “దృశ్యం 2” విడుదలైనప్పుడు మీడియా సంభాషణలో “పాపనాశం-2″కి దర్శకత్వం వహిస్తారా ? అని అడగ్గా… దర్శకుడు జీతు జోసెఫ్‌ “కమల్ హాసన్ సిద్ధంగా ఉంటే, నేను ఈ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాను” అని అన్నారు. మరి ఇది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో? హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.

Exit mobile version