మెగా ఫ్యామిలీలో ఇప్పుడు మరో హీరో కరోనా బారిన పడ్డాడు. చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యిందట. ఈ విషయాన్ని కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. అతికొద్ది లక్షణాలు కనిపించడంతో కళ్యాణ్ బుధవారం రోజున కరోనా టెస్ట్ చేయించుకున్నారట. అందులో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను అని, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. త్వరలోనే మరింత స్ట్రాంగ్ గా తిరిగి వస్తానని, మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు కళ్యాణ్. ఇక ‘విజేత’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ ఈ చిత్రంతో అంచనాలను అందుకోలేకపోయారు. ప్రస్తుతం కళ్యాణ్ ‘సూపర్ మచ్చి’తో పాటు మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా ఇటీవలే కరోనా సోకిన విషయం తెలిసిందే.
మరో మెగా హీరోకు కరోనా…!
