Site icon NTV Telugu

Avram Manchu: తాతకి తగ్గ మనవడు.. మొదటి సినిమాకే అవార్డు

Avram

Avram

తాజాగా 24వ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమం సినీ పెద్దల మధ్య, సినీ ప్రేమికుల మధ్య జరిగింది. ఈ క్రమంలో వైజయంతి మూవీస్ స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లెజెండరీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ కి ఘన సన్మానం జరిపి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మీదుగా అవార్డులు అందించగా మోహన్ బాబు మంచు, విష్ణు మంచు కూడా లెజెండ్రీ ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ గారి చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.

Also Read : Allu Arjun : ఆ విషయంలో అల్లు అర్జున్ సూపర్ అంతే..

అంతేకాకుండా కన్నప్ప సినిమాకి గాను మంచు మూడో తరం అవ్రామ్, తన తాత (డా. మోహన్ బాబు మంచు) చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరితో పాటు కోట శ్రీనివాసరావు స్మారక అవార్డు బాబు మోహన్ మురళీమోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఇటీవలే పాటల రచయితగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భాస్కర భట్ల రవికుమార్ కు కూడా ఘన సన్మానం జరిగింది., అనంత శ్రీరామ్, (కన్నడ) ఆరాధన రామ్, మాలాశ్రీ కుమార్తె (తమిళం) నిధిలం స్వామినాథన్ గార్లు మురళీ మోహన్ చేతుల మీదుగా అవార్డ్స్ అందుకున్నారు.

Exit mobile version