Site icon NTV Telugu

Sukumar : క్రియేటివ్ డైరెక్టర్ సినీ కెరీర్ కు 20 ఏళ్లు..

Whatsapp Image 2024 05 06 At 2.03.25 Pm

Whatsapp Image 2024 05 06 At 2.03.25 Pm

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.లెక్కల మాస్టారు నుంచి స్టార్ డైరెక్టర్ గా ఆయన ఎదిగారు.అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమాతో ఈ లెక్కల మాష్టారు డైరెక్టర్ గా మారారు.ఆర్య సినిమాతో అప్పటివరకు ఎవరు తీయని విధంగా సరికొత్త ప్రేమకథను తెరకెక్కించారు.ఆర్య సినిమా సుకుమార్ కు దర్శకుడిగా మంచి బ్రేక్ ఇచ్చింది.ఆర్య సినిమా 7 మే 2004న విడుదల అయి అద్భుత విజయం సాధించింది.ఆర్య సినిమాతో మొదలైన తన సినీ ప్రస్థానం నేటికీ 20 ఏళ్ళు పూర్తి అయింది.ఆర్య సినిమా నుంచి సినిమా మేకింగ్ సరికొత్త పంథాను చూపిస్తూ ప్రేక్షకులను సుకుమార్ ఎంతగానో ఆకట్టుకున్నారు.ఆర్య సినిమా తరువాత సుకుమార్ తెరకెక్కించిన రెండో సినిమా ‘జగడం’.సుకుమార్ కెరీర్ లో మరో అద్భుతమైన సినిమా ఇది.ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిని ఈ సినిమా మాస్ హీరోగా మార్చింది.అప్పటివరకు యూత్ లో ట్రేండింగ్ గా వున్నా గ్యాంగ్స్ ,గొడవలూ ఎంత ప్రమాదకరమో సుకుమార్ అద్భుతంగా చూపించారు.

ఆ తరువాత వచ్చిన ‘ఆర్య 2’, సుకుమార్‌ను ప్రధానంగా క్యారెక్టరైజేషన్ ఆధారంగా భావోద్వేగాలను నడిపించే వ్యక్తిగా చూపించింది. ఆ తరువాత యువ సామ్రాట్ నాగ చైతన్యతో తెరకెక్కించిన “100% లవ్” సినిమా కూడా సరికొత్త ఉండటంతో యూత్ ఆడియన్స్ కు తెగ నచ్చేసింది.ఆ తరువాత ప్రిన్స్ మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘1: నేనొక్కడినే’ సినిమా హాలీవుడ్ మేకింగ్ స్టైల్ లో సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ఎమోషనల్ గా ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తరువాత గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తో తెరకెక్కించిన ‘రంగస్థలం’ కల్ట్ క్లాసిక్ చిత్రంగా నిలిచిపోయింది .ఈ సినిమాలో రాంచరణ్ లోని సరికొత్త నటుడిని సుకుమార్ బయటకు తీసాడు.ఆ తరువాత వచ్చిన ‘పుష్ప’ చిత్రం గ్లోబల్ వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమాతో అల్లుఅర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.పుష్పతో దర్శకుడు సుకుమార్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు..ఇక త్వరలో రాబోయే పుష్ప 2 చిత్రంతో సుకుమార్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి .

 

Exit mobile version