NTV Telugu Site icon

“ఆర్ఆర్ఆర్” దోస్తీ సాంగ్ @ 20 మిలియన్స్

20 Million Real Time Views for Dosti Song from RRR

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్” నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సాంగ్ ‘దోస్తీ’ నిన్న ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా విడుదలైంది. ఒకేసారి ఐదు భాషల్లో ఆవిష్కరించబడిన “దోస్తి” సాంగ్ 20 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ ను సంపాదించింది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ ‘దోస్తీ’ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. “దోస్తి” వీడియో సాంగ్ లో సంగీత దర్శకులు అమిత్ త్రివేది, ఎంఎం కీరవాణి, అనిరుధ్, విజయ్ ఉన్నారు. ఈ వీడియోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ మనోహరమైన పాటను ఎంఎం కీరవాణి స్వరపరిచారు.

Read Also : “ఎవరు మీలో కోటీశ్వరులు” గురించి ఈ విషయాలు తెలుసా?

డివివి దానయ్య నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్‌ఆర్‌ఆర్‌”లో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రను పోషిస్తుండగా, రామ్‌చరణ్ అల్లూరి సీతారామ రామరాజు పాత్రను పోషిస్తున్నారు. ప్రధాన నటులతో పాటు “ఆర్‌ఆర్‌ఆర్‌”లో బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలియా భట్… రామ్ చరణ్ కు జంటగా, ఒలివియా మోరిస్ జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తున్నారు. రామ్ చరణ్ గురువుగా అజయ్ దేవగన్ నటిస్తున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్” అక్టోబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.